రైతుల కోసం మరో అద్భుత పథకం.. సగం ధరకే ట్రాక్టర్లు అందజేత రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం తీసుకువచ్చింది. ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం కింద సగం ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే వెసులుబాలు కల్పిస్తోంది. ట్రాక్టర్ కొనుగోలు కోసం రైతులు బ్యాంకుల నుంచి కూడా రుణం తీసుకోవచ్చు. By BalaMurali Krishna 11 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి దేశంలోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం తీసుకువచ్చింది. ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం కింద సగం ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చు. మిగతా సగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ట్రాక్టర్ కొనుగోలు కోసం రైతులు బ్యాంకుల నుంచి కూడా రుణం తీసుకోవచ్చు. ఉదాహరణకు.. ట్రాక్టర్ ధర రూ. 10 లక్షలు అనుకుంటే.. అందులో కేంద్రం రూ.5 లక్షలు భరిస్తుంది. మరో రూ. 5 లక్షలు బ్యాంకులు రైతుకు రుణంగా ఇస్తాయి. అంతేకాదు వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటు కూడా కల్పిస్తాయి. ఈ పథకానికి ఆయా రాష్ట్రాలు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తాయి. ప్రతి చిన్న, సన్నకారు రైతు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతు వయస్సు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. సొంత పొలం లేని కౌలు రైతులు.. యజమాని నుంచి ఎన్‌ఓసీ తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చు. ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకునే రైతుల వార్షికాదాయం రూ.1.50 లక్షలకు మించి ఉండకూడదు. గడిచిన 7 సంవత్సరాలుగా ట్రాక్టర్ కొనుగోలు చేయని వారు కూడా ఈ పథకం కింద మళ్లీ దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇక ఈ స్కీం కింద ఒక రైతు ఒక ట్రాక్టర్ మాత్రమే కొనుగోలు చేసే వీలు ఉంటుంది. రైతు తనకు నచ్చిన ట్రాక్టర్‌ను నచ్చిన ధరకు, నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఎలాంటి పత్రాలు సమర్పించాలి? పీఎం ట్రాక్టర్ పథకానికి దరఖాస్తు చేసే రైతులు కచ్చితంగా ఈ పత్రాలు సమర్పించాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు/ఓటర్ ఐడీ / డ్రైవింగ్ లైసెన్స్/ పాస్‌పోర్టు, పొలానికి సంబంధించిన అడంగల్ డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్‌లో అయితే గ్రామ సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాల్లో.. తెలంగాణలో అయితే మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో అయితే పీఎం కిసాన్ వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏమైనా సందేహలు ఉంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఉన్న 155261/011-24300606 హెల్ప్‌లైన్ నంబర్స్‌కు ఫోన్ చేయవచ్చు . తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మరో అడుగు ముందుకేసి వినూత్నంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం..యంత్రలక్ష్మి పేరుతో అమలు చేస్తూ.. ట్రాక్టర్ సహా వ్యవసాయ పరికరాలను కూడా అందజేస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ యంత్రసేవ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి