Premikudu Re-Release: ఊర్వశీ.. ఊర్వశీ.. ప్రభుదేవా 'ప్రేమికుడు' రీ రిలీజ్

ప్రభుదేవా,నగ్మా జంటగా నటించిన క్లాసిక్ హిట్ 'ప్రేమికుడు' దాదాపు 30 సంవత్సరాల తర్వాత మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. సెప్టెంబర్ 13న థియేటర్స్ లో గ్రాండ్ రీ రిలీజ్ కానుంది.1994లో రిలీజైన ఈ మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

New Update
Premikudu Re-Release: ఊర్వశీ.. ఊర్వశీ.. ప్రభుదేవా 'ప్రేమికుడు' రీ రిలీజ్

Premikudu Re-Release: ఊర్వశీ.. ఊర్వశీ.. టేకిట్ ఈజీ పాలసీ, అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే, ముక్కాలా.. ముక్కబులా లైలా, ఓ చెలియా నా ప్రియా సఖియా.. అబ్బో ఒకటేంటి ఇలా సినిమా మొత్తం ఎవర్ గ్రీన్ మ్యూజికల్ చార్ట్ బస్టర్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ 'ప్రేమికుడు'. ఎస్. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా- నగ్మా జంటగా 30 సంవత్సరాల క్రితం యూత్ ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో యూత్ ను ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా సినిమాలోని పాటలు, పాటలకు ప్రభుదేవా స్టెప్పులు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.

ప్రేమికుడు రీ రిలీజ్

అయితే దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ చిత్రం మరో సారి ప్రేక్షకులను అలరించేంది వచ్చేస్తుంది. సెప్టెంబర్ 13న 'ప్రేమికుడు' మూవీ థియేటర్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో మూవీకి సంబంధించిన రీల్స్, వీడియోస్ షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరో సారి తెరపై వింటేజ్ ప్రభుదేవా వైబ్స్ ఎంజాయ్ చేయడానికి వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: 35-Chinna Katha Kaadu OTT: '35- చిన్న కథ కాదు' ఓటీటీ డీల్.. ప్రముఖ సంస్థకు స్ట్రీమింగ్ రైట్స్ - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు