Kalki 2898AD : 6 రోజుల్లో రూ.615 కోట్లు.. 'కల్కి' దెబ్బకు రజనీకాంత్‌, విజయ్‌ రికార్డులు బ్రేక్..!

ప్రభాస్ 'కల్కి' సినిమా తాజాగా మరో సరికొత్త రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన టాప్‌ 15 సినిమాల్లో రజనీకాంత్‌ ‘జైలర్‌’, విజయ్‌ 'లియో' సినిమాలను 'కల్కి' అధిగమించింది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ రికార్డులను బ్రేక్‌ చేయడం విశేషం.

Kalki 2898AD : 6 రోజుల్లో రూ.615 కోట్లు.. 'కల్కి' దెబ్బకు రజనీకాంత్‌, విజయ్‌ రికార్డులు బ్రేక్..!
New Update

Prabhas 'Kalki 2898 AD' Records :  బాక్సాఫీస్ దగ్గర 'కల్కి' దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. జూన్ 27 న రిలీజైన ఈ మూవీ రెండో వారంలోనూ రికార్డు స్థాయి వసూళ్లతో అదరగొడుతుంది. ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా తాజాగా మరో సరికొత్త రికార్డు సాధించింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.615 కోట్లతో కోలీవుడ్ స్టార్స్ రజినీకాంత్ (Rajinikanth), విజయ్ (Vijay) రికార్డులను బ్రేక్‌ చేసింది.

ఆరు రోజుల్లోనే...

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన టాప్‌ 15 సినిమాల్లో రజనీకాంత్‌ ‘జైలర్‌’ (Jailer Movie), విజయ్‌ 'లియో' (Leo) సినిమా లను ప్రభాస్‌ 'కల్కి' అధిగమించింది. కేవలం ఆరు రోజుల్లో ఈ అగ్ర హీరోల సినిమా రికార్డులను బ్రేక్‌ చేయడం విశేషం. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు ‘కల్కి’ రూ.615 కోట్లు వసూలు చేసింది. ఇంకా కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. దీంతో మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read : వెంకీమామతో ఐశ్వర్య, మీనాక్షి రొమాన్స్.. ఫస్ట్ లుక్స్ అదిరిపోయాయిగా!

ఇక నార్త్ అమెరికాలో ‘కల్కి’ హవా కొనసాగుతూనే ఉంది. విడుదలకు ముందే అక్కడ సంచలనం సృష్టించిన ఈ చిత్రం మంచి వసూళ్లను సొంతం చేసుకుంటోంది. అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన ఆరో సినిమాగా నిలవడం విశేషం. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, శోభన ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను వైజయంతీ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు.

#rajinikanth-jailer #vijay-leo-movie #kalki-2998-ad-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe