Kalki 2898AD : 'కల్కి' ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ఏకైక ఇండియన్ మూవీగా!

'కల్కి' సినిమా తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. ఆన్ లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో ఈ సినిమాకు ఇప్పటివరకు 12.15 మిలియన్ల టికెట్స్ బుక్ అయ్యాయి. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ 'జవాన్' లైఫ్ టైమ్ కు వచ్చిన 12.01 మిలియన్ల మార్క్‌ని 'కల్కి' మూవీ అధిగమించింది.

New Update
Kalki 2898AD : 'కల్కి' ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ఏకైక ఇండియన్ మూవీగా!

Prabhas 'Kalki 2898AD' Touches Rare Feet In Book My Show : బాక్సాఫీస్ దగ్గర 'కల్కి' దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ జూన్ 27 న రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. ఆన్ లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో 'కల్కి' సినిమాకు ఇప్పటివరకు 12.15 మిలియన్ల టికెట్స్ బుక్ అయ్యాయి.

ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ 'జవాన్' లైఫ్ టైమ్ కు వచ్చిన 12.01 మిలియన్ల మార్క్‌ని 'కల్కి' మూవీ అధిగమించింది. తద్వారా దేశంలో ఇలా అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన మూవీగా 'కల్కి' అరుదైన ఘనత సాధించింది.

Also Read : ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలు/వెబ్ సిరీస్ లు ఇవే..!

సినిమాలో విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ లాంటి యంగ్‌ హీరోల అతిథి పాత్రలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందునుంచీ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి 'పార్ట్‌ 2' పై అంచనాలు పెంచేశారు.సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా.. సీనియర్ నిర్మాత అశ్వినీదత్ సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Advertisment
తాజా కథనాలు