డిసెంబర్ 29 న తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam kumar reddy) , శ్రీధర్ బాబు (Sridhar babu) లు మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda Project) సందర్శనకు వెళ్లనున్నట్లు అధికారులు వివరించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా రెడీ అయినట్లు వారు తెలిపారు. 29 ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ (Helicofter)లో మంత్రులు మేడిగడ్డకు బయల్దేరతారు.
ఆ తరువాత వారు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఆ తరువాత ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు..కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాల గురించి ప్రజలకు వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు, ప్రాజెక్టు నిర్వహణకు వినియోగించిన విద్యుత్ వివరాలను కూడా అధికారులు వివరిస్తారు.
మేడిగడ్డ, సిందిళ్ల అన్నారం బ్యారేజ్ లకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలు ఇతర అంశాల గురించి రివ్యూ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ లను మంత్రులు సందర్శించిచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లకు , నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికీ సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఈఎన్‌సీని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కవర్ చేయడానికి మీడియా మిత్రులకు కూడా సమచారం అందించాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
Also read: ఫ్రాన్స్ లో చిక్కుకున్న భారతీయుల విమానానికి లైన్ క్లియర్..నేడు భారత్ కు!