పోటెత్తిన గోదావరి..రాములోరి గుడి చుట్టూ నీళ్లు..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది పోటెత్తుతోంది. గంటకు గంటకు భారీగా వచ్చిన చేరుతోన్న వరదతో ఉగ్రరూప దాల్చుతోంది. జూలై మధ్యాహ్నం వరకు నది నీటి మట్టం 44.4 అడుగులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

New Update
పోటెత్తిన గోదావరి..రాములోరి గుడి చుట్టూ నీళ్లు..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ!

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది పోటెత్తుతోంది. గంటకు గంటకు భారీగా వచ్చిన చేరుతోన్న వరదతో ఉగ్రరూప దాల్చుతోంది. జూలై మధ్యాహ్నం వరకు నది నీటి మట్టం 44.4 అడుగులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Poured Godavari..water around Ramulori temple..first danger warning issued!

ఇక మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి భారీ వరద నదిలోకి వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం దగ్గర గోదావరి నుంచి 9 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.

ఇక నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద నదికి వరద పోటెత్తుతున్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటికి రావొద్దని చెబుతున్నారు. ఇక ఆగష్టు మొదటి వారం వరకు వర్షాలు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో గోదావరి నదికి మరింత వరద పోటు తప్పేట్టుగా లేదు.

అయితే ఇప్పటికే రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారి నీటిమట్టాలు దాటుతున్నాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కూడా వరదతో నిండిపోయాయి. అక్కడి నుంచి విడుదల చేస్తున్న నీటితో మూసీ ఉద్దృతిగా ప్రవహిస్తోంది. మరోవైపు గ్యాప్ ఇవ్వకుండా కురుస్తున్న వర్షంతో గ్రేటర్లోని కాలనీలన్నీ చెరువుల్లా మారాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు