Election Results Counting: పోస్టల్ బ్యాలెట్లు ఇలా.. ఈవీఎంలు అలా... కౌంటింగ్ ప్రాసెస్ ఇదే!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని క్షణాల్లో ఓటింగ్ షురూ కానుంది. మొదట పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు.

New Update
Telangana Election Counting: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని క్షణాల్లో ఓటింగ్ షురూ కానుంది. మొదట పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. ఇవి పూర్తయ్యాక అభ్యర్థులు లేదంటే వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాగ్ రూమ్ ను ఒపెన్ చేసి కంట్రోల్ యూనిట్లను టేబుల్ కు తీసుకువస్తారు. కంట్రోల్‌ యూనిట్‌లోని ‘టోటల్‌’ బటన్‌ను ప్రెస్ చేయగానే ఎన్ని ఓట్లు పోలయ్యాయో వివరంగా తెలుస్తుంది. పోలైన ఓట్ల వివరాలను 17-సి పేరిట నమోదు చేసిన రికార్డుతో.. కంట్రోల్‌ యూనిట్‌లో వచ్చిన మొత్తం ఓట్లతో సరిపోయాయా? లేదా? అని పరిశీలిస్తారు.

ఆ తరువాత ‘ఫలితాలు’ మీటను నొక్కగానే ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో క్లియర్ గా కనిపిస్తాయి. ఆ వివరాలను ఇటు అధికారులు, అటు పోలింగ్‌ ఏజెంట్లు నమోదు చేసుకుంటారు. ఏజెంట్ల నుంచి ఆమోదం లభించిన తరువాత వారి సంతకాలు తీసుకుంటారు. అనంతరం మరో కంట్రోల్‌ యూనిట్‌ను లెక్కిస్తారు. ఇలా ఒక్కో విడతకు 14 కంట్రోలు యూనిట్లలోని వివరాలు లెక్కించేలా 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. 14 ఈవీఎంల లెక్కింపు పూర్తయితే ఒక రౌండు ముగిసినట్లు. అభ్యర్థులు, ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల కోసం ఏర్పాటు చేసిన నియోజకవర్గాల్లో 28 ఈవీఎంల లెక్కింపును ఒక రౌండుగా పరిగణిస్తారు.

అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక ఆ నియోజకవర్గ లెక్కింపు పరిశీలకుడు, ఏజెంట్ల సమక్షంలో.. ర్యాండమ్‌గా అయిదు వీవీప్యాట్స్‌ను సెలక్ట్ చేస్తారు. వాటిలోని ట్రేలను తెరిచి ఓటరు స్లిప్పులను లెక్కించడం ప్రారంభిస్తారు. ఇలా 5వీవీ ప్యాట్‌లలో లెక్కించిన వివరాలకు.. అంతకుముందు ‘17-సి’లో నమోదు చేసిన ఓట్ల సంఖ్యకు సరిపోలితే అధికారులు, ఏజెంట్ల ఆమోదంతో ఫలితాలను ప్రకటించేస్తారు.

ఇది కూడా చదవండి:  సంక్రాతికి ఏపీ వెళ్లే వారికి షాక్.. అప్పుడే ట్రైన్లన్నీ ఫుల్!

Advertisment
తాజా కథనాలు