ఉద్యోగంలో విజయం సాధించలేదా?ఇలా చేయండి..! మీరు మీ ఉద్యోగంలో ఆశించిన ఫలితాలను పొందకపోతే, చంద్రుడు కారణం కావచ్చు. ఆత్మ విశ్వాసం దెబ్బతినడం వలన జరిగే ఈ పరిణామాలకు కొన్ని పరిహారాలున్నాయి. అవి పాటిస్తే మీరు కోల్పోయిన మీ విజయాన్ని తిరిగి పొందవచ్చు. By Nedunuri Srinivas 24 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి positive effects of Moon in astrology: ఒక వ్యక్తి పూర్తి సమర్థుడిగా ఉండాలంటే, పనిని అర్థం చేసుకోవడం ,ఆ పనిని కొత్త మార్గంలో ఆవిష్కరించడం ముఖ్యం. సమర్ధవంతంగా ఏ పని చేయాలన్నా ఆత్మవిశ్వాసంతో పాటు సరయిన తెలివితేటలు అంతే ముఖ్యం. మీరు చాలా మందిని చూసి ఉంటారు, వారు కష్టపడి పనిచేసినప్పటికీ విజయం సాధించలేదు, దీనికి ప్రధాన కారణం ఆత్మవిశ్వాసం లేకపోవడం. దానికి ప్రధాన కారణం మనస్సు బలహీనపడటమే. చంద్రుడు గ్రహానికి సంబంధించినది చంద్రుడు మనస్సుకు కారకుడు. మనసు బలహీనంగా మారితే, వ్యక్తి ఆత్మవిశ్వాసం కోల్పోవడం, అశాంతి, మానసిక స్థితి లేకపోవడం, అనేక ప్రతికూల ఆలోచనలతో మనసు కకావికలం అయి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు మీ ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు రాకపోతే దానికి కారణం చంద్రుడు కావచ్చు. కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయడం వలన ద్వారా, మీరు కోల్పోయిన మీ విజయాన్ని తిరిగి పొందవచ్చు. *ఇంట్లో శివుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచండి, అందులో చంద్రదేవుడు శివుని తలపై కూర్చున్నాడు. రుద్రాక్ష జపమాలతో పంచాక్షరీ మంత్రాన్ని జపించండి. * వెండి గ్లాసులోనే ఎల్లపుడు నీరు తాగడం మంచిది. అదే గ్లాసులో రాత్రిపూట నీటిని నింపి ఉదయం తాగండి. *జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్న వ్యక్తులు ఎప్పుడూ పాలు మరియు నీటిని వృధా చేయకూడదు. సోమవారం నాడు నిరుపేద స్త్రీకి పాలు దానం చేయండి. *ఏదైనా చెట్టుకు లేదా మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయండి, మీరు ఇంట్లో గార్డెనింగ్ బాధ్యత తీసుకుంటే చాలా మంచిది. పక్షులకు ఆహారం ఇవ్వాలి, పక్షుల ఆహారం పెట్టడం వలన అవి మీ సమస్యలను కూడా తింటాయని నమ్ముతారు. * మీరు మానసికంగా దృఢంగా లేకుంటే, కొన్ని రోజుల పాటు ప్రతిరోజూ ఏదైనా దానం చేయండి. *పౌర్ణమి వ్రతం పాటించడం, ఖీర్ తయారు చేసి రాత్రి చంద్రకాంతిలో ఉంచి మరుసటి రోజు మొట్టమొదట తినడం మంచిది. * మీ జన్మ నక్షత్రం మీకు తెలిస్తే, ఈ రోజున ఉప్పును వదులుకోవడం మీ చంద్రుడిని బలపరుస్తుంది. * సంబంధాలలో చంద్రుడు తల్లికి సంబంధించినవాడు, కాబట్టి మీరు చంద్రుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, మీ తల్లిని , తల్లిలాంటి స్త్రీలను గౌరవించడం, సేవ చేయడం మీ విధి. Also Read:మీ రెజ్యూమ్ తయారు చేసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి. #astrology #moon #moon-sign #job-tips #astro-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి