/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-35-1.jpg)
Usha Uthup Husband Passed Away : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. : ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త జాని చాకో ఉతుప్ (78) సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కోల్‌కతాలోని వారి నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. టీవీ చూస్తోన్న సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన కన్నుమూసినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ఉషా ఉతుప్‌కు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. ఉషా ఉతుప్ భర్త మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read : మహేష్ కు యాక్టింగ్ క్లాసులు.. నేర్పించేది ఎవరో తెలుసా?
ఉషా ఉతుప్ విషయానికొస్తే.. సినీ సంగీత ప్రపంచంలో గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 1971లో ‘హరేరామ హరేకృష్ణ’ సినిమాలోని పాటకు ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ‘కీచురాళ్లు’ టైటిల్ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఉషా.. ఇక్కడ కూడా చాలా పాటలు పాడి అలరించారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘రేసుగుర్రం’ టైటిల్ సాంగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇప్పటివరకు 15 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఆమె పాటలు పాడి అలరించారు. ఇటీవలే ఆమె పద్మభూషణ్ అవార్డు సైతం అందుకున్నారు.
Follow Us