Poonam Kaur: ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండండి.. ఆ లీడర్‌పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్

Poonam Kaur: ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండండి.. ఆ లీడర్‌పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
New Update

poonam-kaur-tweets-about-andhra-pradesh-politics

దుమారం రేపుతున్న పూనమ్ ట్వీట్..

తెలుగు ప్రజలకు పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. కొన్నిసార్లు ఆమె పెట్టే పోస్టులు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా పూనమ్.. ఏపీ రాజకీయాల గురించి చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపుతోంది. ఆ ట్వీట్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఉందని సేనాని అభిమానులు మండిపడుతున్నారు.

ఫేక్ లీడర్లతో జాగ్రత్తగా ఉండండి..

అసలు ఆ ట్వీట్‌లో ఏం ఉందంటే.. 'మహిళల సంరక్షణ గురించి గొంతెత్తి చించుకుంటున్న లీడర్లు.. ఢిల్లీలో మహిళా రెజ్లర్లు నిరసన చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇలాంటి ఫేక్ లీడర్లతో జాగ్రత్తగా ఉండండి. వాళ్లకి అనుకూలంగా, ప్రయోజనం ఉన్నప్పుడే మాట్లాడుతుంటారు' అంటూ ఆంధ్రప్రదేశ్‌ను హ్యాష్ ట్యాగ్‌గా జతచేసింది. దీనిని బట్టి చూస్తుంటే పేరు ఎత్తకుండానే ఏపీలోని ఓ రాజకీయ నాయకుడి గురించి చెప్పకనే చెప్పిందని అర్థమవుతోంది. అయితే ఇది తమ నాయకుడు పవన్ కల్యాణ్‌ గురించేనని ఆయన అభిమానులు ఆగ్రహం చేస్తూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అనవసరంగా ఎందుకు వివాదాలు సృష్టిస్తున్నారంటూ మండిపడుతున్నారు.

మహిళల భద్రతపై పవన్ వ్యాఖ్యలు..

ఇటీవల వపన్ కల్యాణ్‌ వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్ల వల్ల ఏపీలోని మహిళలు మిస్ అవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. మహిళల భద్రత గురించే తన ఆందోళన అని పవన్ స్పష్టంచేశారు. మహిళలపై మాట్లాడిన పవన్ గురించే పూనమ్ పరోక్షంగా ట్వీట్ చేసిందని స్పష్టమవుతోంది. గతంలో కూడా పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ఆమె ట్వీట్స్ చేసి అభిమానుల నుంచి ట్రోల్స్ కు గురైంది. కాగా బీజేపీ ఎంపీ బ్రిష్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనను అరెస్ట్ చేయాలని కొన్ని నెలలుగా ఢిల్లీలో మహిళా రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ తదితరులు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం విధితమే. అంతర్జాతీయ గుర్తింపు పొందిన రెజ్లర్లు రోడెక్కి నిరసన చేస్తే పవన్ ఎందుకు స్పందించలేదని పూనమ్ ట్వీట్ సారాంశంగా చెప్పుకోవచ్చు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe