Pooja Hegde: అరెరె.. బుట్టబొమ్మకు పెద్ద గాయమే అయ్యిందిగా.. అసలేం జరిగిందంటే..

పూజా హెగ్డే తన కాళ్లకు తగిలిన గాయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతే కాకుండా ఆ ఫోటోలకు 'యుద్దపు గాయాలు' అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్.. అరెరె.. బుట్టబొమ్మకు పెద్ద గాయమే అయ్యిందిగా.. అసలేం జరిగిందో అంటూ తెగ ఫీల్ అవుతున్నారు.

New Update
Pooja Hegde: అరెరె.. బుట్టబొమ్మకు పెద్ద గాయమే అయ్యిందిగా.. అసలేం జరిగిందంటే..

heroine pooja hegde : టాలీవుడ్ హీరోయిన్  పూజా హెగ్డే(Pooja Hegde) తన కాళ్లకు తగిలిన గాయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె చర్మం ఎర్రగా కందిపోయినట్టుగా గాయాలు కనిపించాయి. ఆ ఫోటోకి 'యుద్దపు గాయాలు' అని క్యాప్షన్  పెట్టింది. అలాగే బాక్సింగ్ అని కూడా జోడించింది. ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ అయ్యో పూజాకు ఏం అయింది అంటూ ఫీల్ అవుతున్నారు. అయితే వ్యాయామంలో భాగంగా బాక్సింగ్ చేస్తుండగా గాయాలయ్యాయా? లేక ఏదైనా షూటింగ్ లో గాయపడిందా? అనే వివరాలను ఆమె వెల్లడించలేదు.

publive-image

సినిమాల విషయానికి వస్తే వరుస హిట్లతో ఒక వెలుగు వెలిగిన పూజాకు.. ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్టుంది. ప్రస్తుతానికి  పూజా చేతిలో ఏ సినిమాలు లేవు. కొత్తగా ఆఫర్స్ రాకపోగా.. ఉన్న ఆఫర్స్ కూడా చేజారుతున్నాయి.  మరోవైపు మోకాలి నొప్పితో బాధపడుతున్న పూజా హెగ్డే సర్జరీ చేయించుకుందనే వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. గతంలో కాలికి కట్టుతో పూజా కనిపించింది. అయితే కేవలం సర్జరీ కారణంగా పూజా కొన్ని ప్రాజెక్ట్స్ నుండి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.

publive-image

మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' సినిమాలో ఆమె క్యారెక్టర్ ను తగ్గించి, ఆమెను సెకండ్ హీరోయిన్ స్థాయికి తగ్గించేశారట. దీంతో, తాను తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేసి, ఆ సినిమాకు పూజా గుడ్ బై చెప్పేసింది. 'జనగణమన' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా  చేజారింది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో తెరకెక్కాల్సిన చిత్రం నిర్మాతలు తప్పుకోవడంతో నిలిచిపోయింది.

publive-image

ఏది ఏమైనా పూజా హెగ్డే కెరీర్ ప్రమాదంలో పడింది. వరుసగా ఆరు ప్లాప్స్ పడ్డాయి. పూజా హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ నిరాశపరిచింది. ఎఫ్ 3 చిత్రంలో ఐటెం సాంగ్ కు డ్యాన్స్ చేయగా ఆ చిత్రం కూడా నష్టాలు మిగిల్చింది.  ఇలా వరుస ఫ్లాపులతో  పూజా ఐరన్ లెగ్ ట్యాగ్ మూటగట్టుకుందని కొందరు విమర్శలు చేస్తున్నారు.

Also Read: ఇంటి సభ్యులను ఏడిపించిన బిగ్ బాస్.. లెటర్ కోసం కన్నీటి దారాలు..?

Advertisment
తాజా కథనాలు