తనపై ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మూడు రోజుల్లో తన కుటుంబ సభ్యులపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో దోచుకున్న లక్ష కోట్లను ఖర్చు చేసి గెలవాలని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్లాన్ వేసిందన్నారు. కానీ గెలవలేమని నిర్ణయానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలు బీజేపీతో చేతులు కలిపిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయాలన్న కుట్రలు చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావును కేటీఆర్ టార్గెట్ చేశారన్నారు.
ఇది కూడా చదవండి: YS Sharmila: వైఎస్ పేరును చెడగొట్టావ్.. రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్!
పొత్తు కుదిరిన నేపథ్యంలో ఖమ్మం సీపీఐ కార్యాలయానికి ఈ రోజు కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లారు. పొత్తు ధర్మంలో భాగంగా సీపీఐకి కేటాయించిన కొత్తగూడెంలో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana Congress: దగ్గరకు తీసుకోని బీఆర్ఎస్.. కాదన్న కాంగ్రెస్.. జలగం దారెటు?
పాలేరులో తనకు సంపూర్ణ మద్దతును ప్రకటించి.. తనకు భారీ మెజారిటీ దక్కేలా కృషి చేయాలని కోరారు. కమ్యూనిస్టులకు ఎవరు ఓట్లేస్తారంటూ అహంకారపూరితంగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డికి తన గెలుపు ద్వారా బుద్ధి చెప్తానని ఈ సందర్భంగా పొంగులేటి అన్నారు.