Ponguleti: ప్రజల వద్దకే కాంగ్రెస్ పాలన.. 6 హామీలూ అమలు చేసి తీరుతామన్న మంత్రి పొంగులేటి

ఈ నెల 28 నుంచి జనవరి ఆరో తేదీ వరకు ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన మార్గదర్శకాలకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. ఏ దరఖాస్తునూ నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టంచేశారు.

New Update
TG Rains: కలెక్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమవ్వండి.. మంత్రి పొంగులేటి ఆదేశాలు!

Ponguleti Srinivas Reddy: ప్రభుత్వానికి కళ్లూ చెవులూ అధికారులే అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వారు బాధ్యతగా పనిచేస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు సరిగ్గా అందుతాయన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి ఆరో తేదీ వరకు ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన సభల నిర్వహణ కోసం మార్గదర్శకాలకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు.

ఇది కూడా చదవండి: సోనియాతో సీఎం రేవంత్ భేటీ.. ఆ విషయాలపైనే ప్రధాన చర్చ

మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి రోజూ రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి ప్రతి మండలంలో బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తులను నింపి గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏ ఒక్క దరఖాస్తునూ నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తు దారుడికీ 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకూ సమయం కేటాయించాలన్నారు.

ప్రజాపాలనలో అధికారులు , ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమైనదని, వారు బాధ్యతయితంగా పని చేయాలని సూచించారు. దరఖాస్తు దారుడికి రూపాయి ఖర్చు లేకుండా చూడాలని, జిరాక్స్ కేంద్రాలలో కూడా ఎక్కువ మొత్తం వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సభల వద్ద తగిన్నన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి దరఖాస్తుకూ తప్పనిసరిగా రశీదు అందించాలని చెప్పారు. దరఖాస్తుల వివరాలన్నిటినీ ఆన్ లైన్ లో నమోదు చేయాల్సిందేనని స్పష్టంచేశారు. అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: AP: జీతాల పెంపు సాధ్యం కాదు.. అంగన్వాడీలతో చర్చలు విఫలం

Advertisment
తాజా కథనాలు