Indiramma Houses: రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పేదలకు అసైన్ భూములకు పట్టాలు ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయితే.. గత ప్రభుత్వం ఆ భూములను తీసుకుందని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం తీసుకున్న భూములను పేదలకు పంచుతామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అతి కొద్ది రోజుల్లో 4.50 లక్షల ఇళ్లు కట్టబోతున్నామన్నారు. నేలకొండపల్లి మండలం గువ్వల గూడెంలో ఈ రోజు పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్యకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల విలువైన ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత పేదలు, రైతుల పక్షపాతిగా ఉందన్నారు. రూ.31 వేల కోట్లు రైతుల రుణాలు మాఫీ చేసిందన్నారు. ధరణి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. మంచి పరిపాలన కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామన్నారు. ఆడబిడ్డలు, రైతుల మొహంలో ఆనందం చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు !