Ponguleti Srinivas Reddy: త్వరలో 4.50 లక్షల ఇళ్లు.. ఆ భూములను పంచుతాం: మంత్రి పొంగులేటి శుభవార్త పేదల కోసం త్వరలో 4.50 లక్షల ఇళ్లు కట్టబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం తీసుకున్న అసైన్డ్ భూములను తిరిగి పేదలకు పంచుతామన్నారు. ఈ రోజు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పర్యటించారు. By Nikhil 04 Aug 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Indiramma Houses: రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పేదలకు అసైన్ భూములకు పట్టాలు ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయితే.. గత ప్రభుత్వం ఆ భూములను తీసుకుందని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం తీసుకున్న భూములను పేదలకు పంచుతామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అతి కొద్ది రోజుల్లో 4.50 లక్షల ఇళ్లు కట్టబోతున్నామన్నారు. నేలకొండపల్లి మండలం గువ్వల గూడెంలో ఈ రోజు పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్యకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల విలువైన ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత పేదలు, రైతుల పక్షపాతిగా ఉందన్నారు. రూ.31 వేల కోట్లు రైతుల రుణాలు మాఫీ చేసిందన్నారు. ధరణి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. మంచి పరిపాలన కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామన్నారు. ఆడబిడ్డలు, రైతుల మొహంలో ఆనందం చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. Also Read: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. త్వరలో యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ! #telangana-news #ponguleti-srinivas-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి