Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
నీట్ పరీక్షలపై అక్రమాలను సహించేది లేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎన్టీయే పనితీరుపై ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తామని అన్నారు. పాట్నాలో నీట్ పేపర్ లీక్‌పై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు గనులను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గతంలో ప్రైవేటు కంపెనీలకు అప్పగించాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కోయగూడెంకు 3, సత్తుపల్లికి 3 కోల్ బ్లాక్‌లను తిరిగి సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోందని పేర్కొన్నారు.
రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్లను పునరుద్ధరణ చేశారు.
ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ మళ్లీ మొదలైంది. జూన్ 21 నుంచి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ ప్రారంభం కానుంది. జగన్ అక్రమాస్తులకు సంబందించి సీబీఐ 11, ఈడీ 9 కేసులు నమోదు చేసింది.
రాష్ట్రంలో హౌసింగ్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. పీఎం పాలెం టిడ్కో ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 6 నెలల్లో ఇళ్లు పూర్తి చేసి అందజేస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు.
ఏపీలో శుక్రవారం జరగనున్న అసెంబ్లీ సమావేశానికి వైసీపీ చీఫ్ జగన్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. కౌరవులు ఉన్న సభకు వెళ్లి అక్కడ మనం ఏదో చేస్తామన్న నమ్మకం లేదని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన అన్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ నగరానికి వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నారు. సెల్యూట్ తెలంగాణ పేరిట భారీ ర్యాలీని నర్వహిస్తున్నారు. ర్యాలీ అనంతరం బీజేపీ నూతన ఎంపీలు, ఎమ్మెల్యేలను సన్మానించనున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో కౌన్సిలర్లపై వాలంటీర్లు మున్సిపల్ కమిషనర్‌కు పిర్యాదు చేశారు. తమను బలవంతంగా రాజీనామా చేయించారని కమిషనర్‌కు పిర్యాదు చేశారు. తమను ముఖ్యమంత్రి చంద్రబాబు విధుల్లో తీసుకోవాలని వాలంటీర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.