Kejriwal : కేజ్రీవాల్ అరెస్ట్!
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది.
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది.
TG: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీకి పయనం కానున్నారు. కాగా సంజయ్ కుమార్ చేరికపై జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
దేశ చరిత్రలో తొలిసారిగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్డీయే నుంచి ఓం బిర్లా మరోసారి స్పీకర్ కూర్చి కోసం పోటీ పడుతున్నారు. అలాగే ఇండి కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ పోటీకి దిగారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
ప్రధాని మోదీ జూలైలో రష్యాకు వెళ్లనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖాయమని, ఆయన రాకకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూర్తి ఉషకోవ్ చెప్పారు. మోదీ 2019లో చివరిసారిగా రష్యాకు వెళ్లారు.
AP: డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురానికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 29న తెలంగాణలోని కొండగట్టు అంజన్నను దర్శించుకొని జులై 1న పిఠాపురానికి వెళ్తారు. మూడు రోజుల పాటు పిఠాపురంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు.
ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిక కేఎస్ శ్రీనివాసరాజు వాలంటీరి రిటైర్మెంట్ తీసుకున్నారు.శ్రీనివాసరాజు డిప్యుటేషన్‌పై తెలంగాణలో నాలుగేళ్లకు పైగా విధులు నిర్వహించారు. ఆయన టీటీడీ ఈవోగా వెళ్లేందుకు ప్రయత్నించగా అది జరగకపోవడంతో ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు.
లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈరోజు విచారించనుంది. ఒకవేళ ఈ కేసులో ఆయనకు బెయిల్ వస్తే అరెస్ట్ చేసే ఆలోచనలో సీబీఐ ఉన్నట్లు సమాచారం.
భారతదేశంలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఈరోజు ఎన్నిక జరగబోతోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించకపోవడంతో.. ఇండి కూటమి నుంచి అభ్యర్థిని పోటీలో నిలబెట్టారు. అధికార ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా.. ఇండి కూటమి అభ్యర్థిగా సురేష్ పోటీలో ఉన్నారు.
తిరుమల శ్రీవారి భక్తుల వసతి గదులకు సంబంధించి టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా వసతి అందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు