Jammu & Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఫైనల్ రిజ్టల్ట్స్ వెలువడ్డాయి. మొత్తం 90 స్థానాలకుగానూ జరిగిన ఎన్నికల్లో అధికార పీఠాన్ని నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి సొంతం చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి 42 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 29 స్థానాల్లో గెలుపొందింది.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) 6, జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (JKPDP) 3, జమ్మూకశ్మీర్ పీపుల్ కాన్ఫరెన్స్ (JPC) 1, సీపీఐ 1, ఆమ్ ఆద్మీ 1, ఇతరులు 7 స్థానాలను సొంతం చేసుకున్నారు. ఇక 2014లో 87 సీట్లకు బీజేపీ 25 స్థానాలు సాధించింది. పీడీపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపించింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో సీట్లు 90కి పెరిగాయి. గవర్నర్ కోటాలో 5 నామినేటెడ్ సీట్లు ఉన్నాయి. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ 48 సొంతం చేసుకుంది.