/rtv/media/media_files/2024/10/25/7Bod6P6nQLilWLFmMxE3.jpeg)
వైసీపీ అధినేత వైయస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హిందూపురానికి చెందిన ఇద్దరు వైసీపీ నేతలను ఆయన సస్పెండ్ చేశారు. నవీన్ నిశ్చల్ వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందంటూ ప్రకటించారు. పార్టీ ఇంచార్జ్ దీపిక ఈ విషయాన్ని హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జగన్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నవీన్ నిశ్చల్ తో పాటు వేణుగోపాల్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. టిడిపి నుంచి నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం లో నవీన్ నిశ్చల్ బలమైన నేతగా ఉన్నారు. దీంతో ఆయన సస్పెన్షన్ పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపుతో అన్న అంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.