Warangal Congress: వరంగల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

వరంగల్ కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్సీ, కొండా మురళి మధ్య అధిపత్య పోరు బయటపడింది. పార్టీ మారిన బస్సరాజు సారయ్య దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని కొండా మురళి సవాల్ విసరడం ఓరుగల్లు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

New Update
Warangal Congress: వరంగల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

Warangal Congress: వరంగల్ జిల్లాలో రాజకీయాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వార్నింగ్ ఇచ్చారు. బీసీ నాయకుడివి అయి బీసీలకు అన్యాయం చేస్తావా? అని నిలదీశారు. ఇలాంటి పనులు మానుకో అని హెచ్చరించారు. లేదంటే అధిష్టానంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. నువ్వు పార్టీ పరంగా గెలిచి పార్టీ మారావు అని విమర్శించారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలువు అని సవాల్ చేశారు.

పోచమ్మ మైదాన్‌లో తొలగించిన పాన్‌డబ్బా బాధితులను పరామర్శించిన కొండా మురళి.. ఇపుడు అంతా నాదే హవా.. ఇక్కడే ఉండండి, ఎవడొచ్చినా చూస్కుంటా అని బాధితులకు భరోసా ఇచ్చారు. కాగా పోచమ్మ మైదాన్ గుడి దారికి వెళ్లే డబ్బాలు అడ్డంగా ఉన్నాయని అక్కడి అధికారులు తొలిగించారు. దీంతో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యనే చేయించాడని కొండా మురళి ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు