AP Politics: నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియని అడ్డుకున్న పోలీసులు

నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ను అఖిలప్రియ కలిసేందుకు ప్రయత్నం చేశారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

New Update
AP Politics: నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో ఉద్రిక్తత..  భూమా అఖిలప్రియని అడ్డుకున్న పోలీసులు

Nandyal:నంద్యాల జిల్లాలో టెన్షన్ వాతవారణం చోటుచేసుకుంది. సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు ముఖ్యమంత్రి జగన్. అయితే, అదే సమయంలో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులతో కలిసి వెళ్లబోయిన అఖిలప్రియను పోలీసులు అడ్డుకున్నారు.

Also Read: అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. అభ్యర్థి మార్పుపై ఆందోళన..!

అఖిల ప్రియ తరపున టీడీపీకి చెందిన రైతులు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా గంగుల ప్రభాకర్ రెడ్డి వారిని కొట్టి పంపించినట్లు అఖిలప్రియ ఆరోపించారు. ఈ సంఘటనపై అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగుల ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు సిరివెళ్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసులు తమ ఫిర్యాదును తీసుకొని పక్షంలో ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తానని మీడియాకు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు