NTR: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంక్రాంతి రాజకీయం.. మాజీ ఎమ్మెల్యే సౌమ్య V/S ఎమ్మెల్సీ అరుణ్ ..!

నందిగామలో రాజకీయ రగడ నెలకొంది. తనను కించపరిచే విధంగా వైసీపీ నేత కరిముల్లా వ్యవహరించారంటూ మాజీ ఎమ్మెల్యే సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్సీ అరుణ్ స్పందిస్తూ..మమ్మల్ని, మా నాయకులను అన్నప్పుడు సౌమ్యకి సంస్కారం ఎక్కడికి పోయిందంటూ మండిపడ్డారు.

New Update
NTR: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంక్రాంతి రాజకీయం.. మాజీ ఎమ్మెల్యే సౌమ్య V/S ఎమ్మెల్సీ అరుణ్ ..!

NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంక్రాంతి రాజకీయం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే సౌమ్య.. ఎమ్మెల్సీ అరుణ్ మాధ్య రాజీకీయ రగడ నెలకొంది. ఎన్నికల సమయం దగ్గర పడటంతో  టీడీపీ, వైసీపీ రాజకీయాలు మరింత హీట్ పెంచుతున్నాయి. తనను కించపరిచే విధంగా వైసీపీ నేత కరిముల్లా వ్యవహరించారంటూ మూడు రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయలేదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పదవిలో ఇదే శాశ్వతం.. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఈనెల 12వ తేదీన జగనన్న వాక్ వే ప్రారంభం సభలో మాజీ ఎమ్మెల్యే సౌమ్య పై వ్యంగ పోస్ట్ లు ప్రదర్శించారు. దీనిపై నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల అయినా కేసుపై స్పందించకపోవడంతో వైసీపీ నేత కరిముల్లా ఇంటికి బయలు దేరారు మాజీ ఎమ్మెల్యే. అయితే, అనుమతి లేదంటూ మాజీ ఎమ్మెల్యే సౌమ్య ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేత దుబాయ్ కరిముల్లా పై చర్యలు తీసుకోవాలని నందిగామ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.

Also Read: బచ్చన్ ఇంట్లో గొడవలు.. ఐశ్వర్య-అభిషేక్ విడాకులు ఫిక్స్?

మాజీ ఎమ్మెల్యే సౌమ్య తీరుపై స్పందించిన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్..  జాతీయ నాయకురాలితో పోల్చి వ్యంగ అస్త్రాలు సంధించారు. నన్ను, నా నాయకులను అన్నప్పుడు సౌమ్య కి సంస్కారం ఎక్కడికి పోయింది.. మా అన్నను, నన్ను వసూల్ బ్రదర్స్ అని మాజీ ఎమ్మెల్యే సౌమ్య పిలవలేదా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా లో మాజీ ఎమ్మెల్యే మాట్లాడిందే మంత్రి సభలో దుబాయ్ కరిముల్లా ప్రదర్శించారని వ్యాఖ్యనించారు. మాజీ ఎమ్మెల్యే సౌమ్య పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్సీ అరుణ్. ఇలా పండుగ వేళ టీడీపీ, వైసీపీ మధ్య మాటలు తూటాలు జరుగుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు