Andhra Pradesh: చంద్రబాబుకి ఐటీ నోటీసులపై రాజకీయ దుమారం.. యాక్షన్ మోడ్‌లో వైసీపీ.. సైలెంట్‌ మోడ్‌లో టీడీపీ.

చంద్రబాబుకు ఐటీ నోటీసుల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈ మౌనం వెనుక వ్యూహం ఉందా?. మరోవైపు.. ఐటీ నోటీసుల వ్యవహారంలో దూకుడు పెంచిన వైసీపీ.. నెక్ట్స్ ఏం చేయబోతోంది. ఇదే ఛాన్స్ గా విమర్శల దాడిని పెంచిన ప్రభుత్వ పెద్దలు నెక్ట్స్ ఏం చేయబోతున్నారు? ఈ పరిణామాలో ఏపీ రాజకీయాలు మరింత ఇంట్రస్టింగ్ గా మారాయి.

New Update
Andhra Pradesh: చంద్రబాబుకి ఐటీ నోటీసులపై రాజకీయ దుమారం.. యాక్షన్ మోడ్‌లో వైసీపీ.. సైలెంట్‌ మోడ్‌లో టీడీపీ.

IT Notice to Chandrababu Naidu: టిడిపి అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులంటూ రెండు రోజులగా సాగుతున్న రాజకీయంలో వైసీపీ(YSRCP) పూర్తి యాటాకింగ్ లోకి వెళ్తుండడం.. వైసీపీ చేస్తున్న విమర్శలు ఆరోపణపైన టిడీపీ(TDP) మౌనంగా ఉండడంతో ఆ పార్టీ డిఫెన్స్ మోడ్‌లో పడిపోయిందనే చర్చ జోరుగా సాగుతుంది. ఐటీ నోటీసులపై చంద్రబాబు(Chandrababu Naidu) మౌనానికి కారణాలు ఏంటి?. టిడిపి నెక్స్ట్ ఏం చేయబోతుంది? వైసిపి విసురుతున్న ప్రశ్నలకు టిడిపి సమాధానం చెబుతుందా? సైలెన్స్‌ని మెయింటేన్ చేస్తుందా? ప్రత్యేక కథనం మీకోసం..

అమరావతి ప్రాంతంలో సచివాలయ నిర్మాణాలతో పాటు టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇచ్చిన కాంట్రాక్ట్ సంస్థల నుండి చంద్రబాబుకు భారీ స్థాయిలో ముడుపులు అందాయని.. దానిలో భాగంగానే చంద్రబాబుకు ఐటి నోటీసులు ఇచ్చిందంటూ హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించిన కథనం ఏపీ రాజకీయాల్లో ఓ కుదుపు కుదుపుతుంది. చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. 2016లో తాత్కాలిక సచివాలయం పేరుతో ఐదు బ్లాక్ ల నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం చేపట్టింది. ఐదు బ్లాకుల నిర్మాణాల్లో రెండు షాపూర్ జి పల్లోంజి, మిగతా నాలుగు బ్లాకులను ఎల్ అండ్ టి సంస్థ నిర్మాణం చేపట్టింది. అంతేకాదు రాజధాని ప్రాంతంలోని పేదల కోసం టిడ్కో ఇళ్ల నిర్మాణాలను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, మున్సిపాలిటీల్లో టిడ్కో ఇల్ల నిర్మాణాలను బాబు హయాంలో చేపట్టారు. అయితే సచివాలయ నిర్మాణాలను, టిడ్కో ఇళ్ల నిర్మాణాలను చేపట్టిన షాపూర్ జి పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుండి 118 కోట్ల ముడుపులు అందాయని.. అ ముడపులు వ్యవహారంపై ఐటీ నోటీసులు జారీ చేసిందనే ప్రచారం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు అన్ని నిర్మాణ పనులను ఈ రెండు సంస్థలకే ఇచ్చి.. లబ్ధి పొందారనే అనే అభియోగాలు ఐటీశాఖ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్లు ప్రచారం నడుస్తుంది. దీనిపైన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అవినీతి ఎట్టకేలకు బయటకు వచ్చిందని, చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన టైం ఆసన్నమైంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వైసిపి నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై చంద్రబాబు నాయుడు గానీ, ఆ పార్టీ నేతలు గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

వాస్తవానికి వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టిడిపి ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందని.. ఆ అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చాలని అనేక సందర్భాల్లో ప్రయత్నాలు చేసింది. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ కూడా విచారణకు ఆదేశించింది. చంద్రబాబు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని మానిప్లేట్ చేస్తారని, పక్కా ఆధారాలతోనే చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపిస్తామంటూ వైసీపీ నేతలు పదేపదే చెబుతూ వచ్చారు. అయితే తెలుగుదేశం హయాంలో అవినీతికి సంబంధించి ఎక్కడా కూడా ఆధారాలు లేకపోవడంతో వైసిపి కూడా సైలెంట్ అయిపోయింది. రాజధానిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పునకు సంబంధించి కేసు మాత్రం సిట్ విచారణ చేస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తీయాలనుకున్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు వైసీపీ చూపించలేకపోయింది. వైసీపీ నిరాధార ఆరోపణ చేస్తుందంటూ టిడిపి కూడా మీద మండిపడుతూ వస్తుంది. తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడా అవినీతి జరగలేదని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమను ఇబ్బంది పెట్టడానికే వైసిపి దొంగ దారులు వెతుక్కుంటుందంటూ చంద్రబాబు, లోకేష్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

అయితే, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భారీగా అవినీతి జరిగిందంటూ చెబుతున్నప్పటికీ దానికి సంబంధించిన ఆధారాలు చూపించలేకపోవడంతో వైసీపీ ఆరోపణల్లో పస లేదంటే ప్రతిపక్షాలు తిప్పి కొట్టాయి. టిడిపి అవినీతిని బయటిపెడదాం అనుకున్న వైసీపీ వ్యూహం పనిచేయలేదని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ కథనం, చంద్రబాబుకు ఐటీ నోటీసులు అంటూ జరుగుతున్న ప్రచార వ్యవహారాన్ని వైసిపి గట్టిగానే పట్టుకున్నట్లు కనబడుతుంది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సదరు నోటీసులు చూపిస్తూ బాబు సమాధానం చెప్పాలని, మౌనంగా ఉంటే నిజాలు అబద్ధాలు కావు అంటూ చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు సంధిస్తున్నారు. వైసీపీ కి ఇప్పటివరకు రాని అవకాశం ఐటీ నోటీసులు రూపంలో వచ్చిందని, నేరుగా చంద్రబాబు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడంతో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని ఇరకాటంలో పెట్టాలనేది వైసీపీ ప్లాన్ గా కనబడుతుంది. ఎన్నికల సమయం కావడం మొదటిసారి బాబు అవినీతికి సంబంధించిన కీలకమైన ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడం వంటి అంశాలను రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనేది వైసీపీ వ్యూహంగా ఉంది. రెండు రోజులుగా ఎటాకింగ్ మోడ్‌లో ఉన్న వైసీపీ నేతలు.. అటు పర్సనల్‌గా చంద్రబాబుపై ఇటు పార్టీ పరంగా టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని, ఐటీ నోటీసులపై బాబు నోరు మెదపాలని వైసీపీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు మౌనంగా ఉండడం కూడా వ్యూహంలో భాగమేనని, కచ్చితంగా చంద్రబాబు అవినీతిని ఈసారి బయటపెడతామని వైసీపీ నేతలు అంటున్నారు.

అయితే, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఛాలెంజ్‌లపై తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు నోరు మెదపలేదు.. శనివారం నాడు కాకినాడలో జరిగిన జోనల్ మీటింగ్ సమావేశంలో చివరలో ఒక్క మాట మాత్రమే చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తనమీద ఆరోపణ చేస్తున్నారని, వాటిని పట్టించుకోనని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు టిడిపి నేతలు ఎవరు మాట్లాడకపోవడంతో ఐటీ నోటీసుల వ్యవహారంలో ఆ పార్టీ డిఫెన్స్ మోడ్‌లో పడిపోయిందనే చర్చ కూడా నడుస్తుంది. ఐటి నోటసుల వ్యవహారంపై నేతలు ఎవరూ మాట్లాడకుండా ఉండటమే మేలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. రాబోయేది ఎన్నికల సీజన్ కావడంతో చంద్రబాబు ఐటి నోటీసులు వ్యవహారాన్ని వైసిపి రాజకీయంగా క్యాష్ చే కోవాలని చూస్తుందని ఆరోపణ చేస్తుంది. ఏది ఏమైనా బాబుకు నోటీసుల వ్యవహారం ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచిందని చెప్పాలి.

Also Read:

Telangana Elections: కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తుమ్మల పెట్టిన కండీషన్స్ ఇవే.. మరి కాంగ్రెస్ ఒప్పుకునేనా..?

Amit Shah: ‘ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చూస్తున్నారు’.. ఉదయనిధిపై అమిత్ షా ఫైర్..

Advertisment
Advertisment
తాజా కథనాలు