EX-MP Bharat: రాజమండ్రిలో హీటెక్కిన రాజకీయాలు.. దేవుళ్ళ మీద ప్రమాణాలు

AP: రాజమండ్రిలో రథం రగడ కాక రేపుతోంది. తమ అనుచరుడే ప్రచార రథం తగలబెట్టాడని పోలీసులు చెప్పడంపై మార్గాని భరత్ ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రెస్‌ నోట్‌ను పోలీసులు రిలీజ్ చేశారని మండిపడ్డారు. మరోవైపు చిల్లర రాజకీయాలు మానుకో అని భారత్‌కు కౌంటర్ ఇచ్చారు ఆదిరెడ్డి.

New Update
EX-MP Bharat: రాజమండ్రిలో హీటెక్కిన రాజకీయాలు.. దేవుళ్ళ మీద ప్రమాణాలు

EX-MP Bharat: రాజమండ్రిలో రథం రగడ కాక రేపుతోంది. ఆదిరెడ్డి, మార్గాని భరత్ మాటల మధ్య యుద్ధం ముదురుతోంది. మార్గాని భరత్ ప్రచార రథం దగ్ధం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. మార్గాని భరత్ తండ్రి నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడే ప్రచార రథం తగలబెట్టాడని పోలీసులు తేల్చారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రెస్‌ నోట్‌ను పోలీసులు రిలీజ్ చేశారని ఫైర్ అయ్యారు. రాజమండ్రి మార్కండేయ స్వామి ఆలయంలో సత్య ప్రమాణానికి సిద్ధం అని సవాల్ చేశారు.

మరోవైపు మార్గాని భరత్‌పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఫైర్ అయ్యారు. ఒట్టేసేందుకు రమ్మనగానే నీలాగా నేన ఖాళీగా లేనని చురకలు అంటించారు. చిల్లర రాజకీయాలు మానుకో అని భారత్ కు సూచించారు. నీ పబ్లిసిటీ కోసం దేవుడితో రాజకీయాలు వద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ వ్యవస్థని కించపరిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు