ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి భూమా అఖిల అరెస్టుకు యత్నం

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. భాగ్యనగరంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి  వెళ్తుండగా ఆ ఊర్లో అప్పటికే ఎమ్మెల్యే ఉండడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.

New Update
ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి భూమా అఖిల అరెస్టుకు యత్నం

Kurnool: మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ (Bhooma Akhila Priya)ను ముందస్తుగా అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. భాగ్యనగరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి  వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ఊర్లో అప్పటికే అక్కడ గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రావడంతో అక్కడికి వెళ్లొద్దంటూ ఆపేందుకు ప్రయత్నించారు. శాంతి భద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా, ఆమె పట్టు వీడలేదు.

ఇది కూడా చదవండి: వైసీపీ మరో బిగ్ షాక్.. ‘గుడ్ బై’ చెప్పిన ఎమ్మెల్యే..!

తనను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడానికి ఎలా వస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు అఖిల ప్రియ అరెస్టుకు ప్రయత్నించడంతో కార్యకర్తలు, నాయకులు అడ్డుకున్నారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisment
తాజా కథనాలు