/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-04-at-10.47.45-AM-1.jpeg)
Abids Kidnap: హైదరాబాద్ అబిడ్స్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. కట్టెలమండి ఏరియాలో ఈ ఘటన జరిగింది. తన సోదరుడి కుమార్తెను తీసుకుని కట్టెలమండిలోని తన తల్లి ఇంటికి వెళ్లిన బేగంబజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక. ఆ ఇంటి సమీపంలోని ముత్యాలమ్మ ఆలయం దగ్గర చిన్నారి, మరో బాలుడు ఆడుకోవడానికి వెళ్లారు. కొద్దిసేపటికే బాలుడు తిరిగి వచ్చాడు. చిన్నారి రాకపోవడంతో మేనత్త ప్రియాంక చుట్టుపక్కల వెతికింది. ఎంతకీ బాలిక ఆచూకీ కనపడకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. చిన్నారిని ఓ వ్యక్తి ఆటోలో ఎక్కించుకోవడాన్ని గుర్తించారు. అఫ్జల్‌గంజ్ వరకు ఆటోలో వెళ్ళాడు దుండగుడు. అక్కడి నుంచి కొత్తూరు - శంషాబాద్ బస్‌లో వెళ్ళాడు.
24 గంటల్లోనే..
కిడ్నాపర్ కోసం తీవ్రంగా గాలించారు పోలీసులు. మొత్తం 5 బృందాలుగా ఏర్పడి చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 24 గంటల్లోనే ఆ బాలిక ఆచూకీ కనుక్కొని ఈ కేసును సుఖంతం చేశారు. బాలిక కిడ్నప్ కేసును పోలీసులు ఛేదించారు. బాలికను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కిడ్నపర్ ను అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కిడ్నాపర్‌కు బడితపూజ చేశారు. కిడ్నాపర్‌పై చిన్నారి కుటుంబసభ్యులు దాడి చేశారు. పోలీసులు అడ్డుకున్నా..అతడిని కుటుంబసభ్యులు చితకబాదారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను నెటిజన్లు అభినందిస్తున్నారు.
Also Read : హోటల్‌పై ఉగ్రవాదుల దాడి, 32 మంది మృతి