Crime News: బెంగళూరులోని ఓ స్కూల్ సమీపంలో పేలుడు పదార్థాలు..!

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ పేలుడు నేపథ్యంలో ఎన్‌ఐఏ అధికారులు మరింత అప్రమత్తమైయ్యారు. తాజాగా, నగరంలోని బెల్లందూరు స్కూల్ సమీపంలో పాడుబడిన ట్రాక్టర్ లో పేలుడు పదార్థాలను కనుగొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.

New Update
Crime News: బెంగళూరులోని ఓ స్కూల్ సమీపంలో పేలుడు పదార్థాలు..!

Bangalore: బెంగళూరు సిటీలో ఇటీవల జరిగిన రామేశ్వరం కేఫ్‌ పేలుడు నేపథ్యంలో బాంబుల భయం మరింత పెరిగిపోయింది. స్కూల్స్, పోలీస్ స్టేషన్లకు బాంబు బెదిరింపు ఫోన్లు రావడం కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ అధికారులు మరింత అప్రమత్తమైయ్యారు. తాజాగా, నగరంలోని బెల్లందూరు స్కూల్ సమీపంలో పాడుబడిన ట్రాక్టర్ లో పేలుడు పదార్థాలను కనుగొన్నారు. దీంతో,  స్కూల్ లోని విద్యార్థులను, స్థానికులను భయాందోళనకు గురవుతున్నారు.

Also Read: నష్టాల్లో కదులుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. పేటీఎం షేర్లు 4 శాతం జంప్!

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. పేలుడు పదార్థాలను అక్రమంగా సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, పాఠశాలకు సమీపంలోనే భవనాన్ని నిర్మిస్తున్నారని, రాళ్లు పేల్చడానికి పేలుడు పదార్థాలు తెచ్చి ఉంటారని పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీటిని ఒక ట్రాక్టర్‌లో ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read: కారు పార్కింగ్‌ కోసం భార్యభర్తలను చితకబాదిన పొరుగింటి వారు!

బెళ్లందూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అధికారులు అక్రమంగా పేలుడు పదార్థాల కొనుగోలు, రవాణాపై ఆదారాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే జరిగిన రామేశ్వరం కేఫ్ బాంబ్ పేలుడు కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలాంటి సమయంలోనే పాఠశాల ఆవరణం సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం కావడం ప్రజల్లో మరింత ఆందోళన పెంచుతోంది. సంఘటనపై హై అలర్ట్ అయిన బెంగళూరు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు