Revanth Reddy: టార్గెట్ రేవంత్.. ప్రణీత్ రావు వాట్సాప్ చాట్ లో సంచలన విషయాలు

ఇటీవల సస్పెన్షన్ కు గురైన ప్రణీత్ రావు వాట్సాప్ చాట్ ను రిట్రీవ్ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన అనేక ఫోన్లను ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆ చాట్ లలో గుర్తించినట్లు తెలుస్తోంది.

New Update
Ex DSP Praneeth Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

Ex DSP Praneeth Rao Case: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఆధారాల ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్ రావుకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సస్పెండెడ్ డీఎస్సీ డిలీట్ చేసుకున్న వాట్సాప్ చాట్ ను పోలీసులు రిట్రీవ్ చేయడంతో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు కొంతమంది వ్యక్తుల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేత ఇచ్చిన ఆదేశాలతో తాను టాపింగ్ కు పాల్పడ్డానని ప్రణీత్ రావు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. సదరు నేత వంద మంది ఫోన్ నెంబర్లు ఇచ్చి టాప్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం.

అప్పటి ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు అనే దానిపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాత్రికి రాత్రి 100 నెంబర్లు పంపి ట్యాపింగ్ చేయాలని బీఆర్ఎస్ నేత ఆదేశాలు ఇచ్చినట్లు విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డిని ఎవరు ఎక్కడ కలుస్తున్నారు అనే సమాచారాన్ని ప్రణీత్ రావు చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ నేతకు ప్రణీత్ రావు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Praneeth Rao Case Praneeth Rao Case Praneeth Rao Case Praneeth Rao Case publive-image publive-image publive-image

రేవంత్ రెడ్డి అనుచరుల తోపాటు చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లను సైతం ప్రణీత్ రావు టాప్ చేసినట్లు గుర్తించారు. రేవంత్ తో పాటు ఆయన సోదరుల ఫోన్ నంబర్లు సైతం ప్రణీత్ ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది మీడియా పెద్దల ఫోన్ నంబర్లను సైతం టాప్ చేసినట్లు సమాచారం. ఈ అంశాల ఆధారంగా తదుపరి విచారణ నిర్వహించడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు.

అసలేం జరిగింది:
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేశారనే ఆరోపణలు ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు పై ఉన్నాయి. దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించింది రేవంత్ సర్కార్. అయితే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబీలోని ఎస్ఓటి టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఎస్ఐబీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు.

42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసు శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. హెచ్ డీడీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది.

Also Read: రేపు మధ్యాహ్నం 3గంటలకు లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటన!

Advertisment
తాజా కథనాలు