YouTuber Praneeth: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై గంజాయి కేసు

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై గంజాయి కేసు నమోదైంది. అతను గంజాయి తీసుకున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. అతన్ని విచారించేందుకు మరో మూడు రోజుల కస్టడీకి అనుమతి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

YouTuber Praneeth: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై గంజాయి కేసు
New Update

YouTuber Praneeth: యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కు మరో షాక్ తగిలింది. అతనిపై గంజాయి కేసు నమోదు అయింది. ప్రణీత్ గంజాయి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై NDPS సెక్షన్ కూడా సైబర్ సెక్యూరిటీ పోలీసులు జోడించారు. ఇప్పటికే ప్రణీత్‌పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ప్రణీత్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. 3 రోజుల పాటు కస్టడీ కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసుల పిటిషన్ వేశారు. ఈ క్రమంలో ప్రణీత్ న్యాయవాదికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తండ్రి, కూతురు బంధంపై అసభ్య కామెంట్స్ చేసి ప్రణీత్ అరెస్టయిన సంగతి తెలిసిందే.

Also Read: హార్దిక్ పాండ్యాలానే విడాకులు తీసుకున్న క్రికెటర్లు వీరే!

#youtuber-praneeth
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe