Crime News: భర్త ఆత్మహత్యాయత్నాం.. పేరుకే పోలీస్, వాడో రౌడీ అంటోన్న భర్య..!

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. భార్య విడాకులు ఇవ్వకపోవడంతో భర్త కళాధర్‌రెడ్డి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, తన భర్త ఓ సైకో అంటోంది భార్య శ్వేత. పేరుకే పోలీస్, వాడో రౌడీ అని ఆరోపిస్తోంది.

New Update
Crime News: భర్త ఆత్మహత్యాయత్నాం.. పేరుకే పోలీస్, వాడో రౌడీ అంటోన్న భర్య..!

Crime News: బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేటలో చోటుచేసుకుంది. భార్య విడాకులు ఇవ్వకపోవడం వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు భర్త కళాధర్‌ రెడ్డి అంటున్నాడు. అయితే, తన భర్త ఓ సైకో అంటోంది భార్య శ్వేత. పేరుకే పోలీస్, వాడో రౌడీ అని ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. శ్వేత, కళాధర్‌రెడ్డికి 4ఏళ్ల క్రితం పెళ్లి అయింది. పెళ్లయినప్పటి నుంచీ తరచూ వేధింపులకు గురి చేసేవాడని తెలుస్తోంది. తాగడం, తిరగడం, భార్యను కొట్టడం ఇలా నిత్యం చిత్రహింసలు పెట్టేవాడని అంటోంది. ఎన్నోసార్లు పెద్దలతో పంచాయితీలు పెట్టినా..పలుమారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినా ఏ మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read: RTV ఎక్స్‌క్లూజివ్.. దెయ్యంతో ఒక రాత్రి.. అసలు కాండ్రకోటలో ఏం జరుగుతోంది..!

ఎవరు చెప్పినా కూడా భర్త కళాధర్‌రెడ్డి ప్రవర్తనలో మార్పు కనిపించేది కాదని తెలిపింది.  భర్త ప్రవర్తనపై అలసినపోయి భార్య శ్వేత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. అయితే తాజాగా, మళ్లీ భార్య పుట్టింటికి వచ్చి శ్వేతపై దాడి చేసే ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. శ్వేత పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమైయ్యారు. ఊరి జనం మొత్తం ఏకం అయ్యారు. దీంతో మళ్లీ కళాధర్‌రెడ్డి గొంతు కోసుకుని నాటకం మొదలు పెట్టాడని భార్య ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా, ఓ బాధ్యత గల పోలీస్ పదవిలో ఉంటూ కళాధర్‌రెడ్డి ఇలా ప్రవర్తించడంతో స్థానికులు విమర్శలు గుప్పించారు. భార్యను మంచిగా చూసుకోవాల్సిన భర్త పోలీసు అయి ఉండి ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ మండిపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు