/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mallareddy-jpg.webp)
MLA Mallareddy: మాజీమంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పేట్ బషీరాబాద్‌లోని 32 గుంటల స్థలం కబ్జా చేశారని బాధితుల ఫిర్యాదు చేశారు. తమ స్థలంలోని నిర్మాణాలు కూల్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు సుచిత్రలోనూ భూ కబ్జా చేసినట్లు నిర్ధారించారు.