/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/LOKESH-4-jpg.webp)
Nara Lokesh: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర ఉందని ఏపీ సీఐడి డీజీ సంజయ్ వెల్లడించారు. లోకేష్ పాత్రపై కూడా విచారణ జరుగుతుందని.. కిలారు రాజేష్ అనే వ్యక్తి ద్వారా.. లోకేష్ ఖాతాలో డబ్బులు వెళ్ళాయని ఆయన ఆరోపించారు. అలాగే ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లోనూ లోకేష్‌ను విచారిస్తామన్నారు.
మరోవైపు తన తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయననను కలవడానికి విజయవాడ బయలుదేరిన లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉదయం నుంచి ఆయన రోడ్డు మీదే భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఐదున్నర గంటల పాటు ఎండలో కూర్చొని నిరసన తెలిపడంతో పోలీసులు దిగివచ్చారు. చంద్రబాబుని కలిసేందుకు విజయవాడ వెళ్లేందుకు ఆయనకు అనుమతి ఇచ్చారు. దీంతో పొదలాడ క్యాంప్ సైట్ నుంచి లోకేష్ విజయవాడ బయలుదేరారు.
నా తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారు. చూడటానికి వెళుతున్న నన్ను నడిరోడ్డుపై నిర్బంధించారు. నా పాదయాత్రపై వైకాపా రౌడీమూకలతో దగ్గర ఉండి రాళ్లు వేయించిన పోలీసులు, యువగళం వలంటీర్లపై ఎటాక్ జరిగిందని ఫిర్యాదులు ఇస్తే, రివర్స్ కేసులు వారిపైనే బనాయించిన పోలీసులు నాకు ర… pic.twitter.com/SuzpHpN0aT
— Lokesh Nara (@naralokesh) September 9, 2023
లోకేష్ తమ్ముడ, హీరో నారా రోహిత్ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. నియంత పాలన వాస్తవం అయినప్పుడు.. విప్లవం ఒక హక్కు అవుతుందని నారా రోహిత్ పోస్ట్ చేశారు. ఈ చర్యకు మూల్యం చెల్లించక తప్పదని.. అయితే సమయం రావాలని ట్వీట్ చేశారు.
When dictatorship is a fact, revolution becomes a right. - Victor Hugo
Every penny will be repaid, it's just a matter of time! #WeWillStandWithCBNSir #ChandrababuNaidu pic.twitter.com/RZl2avnBgS
— Rohith Nara (@IamRohithNara) September 9, 2023
అంతకుముందు నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ విషయం తెలుసుకున్న లోకేష్.. ఆయనను కలిసేందుకు బయలుదేరారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్.. నా తండ్రిని చూసే హక్కు కూడా నాకు లేదా ? ఆ సైకో చెప్పాడా నీకు ? పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా గంట నుంచి పోలీసులు హైడ్రామా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్‌తో వివిధ జిల్లాల్లో హై అలెర్ట్ కొనసాగుతోంది. అన్ని జిల్లాలోని ప్రధాన కూడళ్లలో పోలీసు పహారా కాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్టులు చేశారు. మరోవైపు ముందు జాగ్రత్తగా ఆర్టీసీ బస్సులను డిపోల్లోనే నిలిపివేశారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: నా తండ్రిని చూసే హక్కు కూడా నాకు లేదా? ఆ సైకో చెప్పాడా నీకు ? పొదలాడలో టెన్షన్ టెన్షన్!