Breaking: హైదరాబాదు డ్రగ్స్ దందాలో పొలిటిషన్ కొడుకు.!

హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ డ్రగ్స్ దందాలో పొలిటిషన్ కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Breaking: హైదరాబాదు డ్రగ్స్ దందాలో పొలిటిషన్ కొడుకు.!

Breaking: హైదరాబాద్ లో మాదక ద్రవ్యాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల సరఫరాపై చాలా సీరియస్ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పబ్ లు, బార్ లు, క్లబ్ లను సైతం ఎక్కడా వదలకుండా స్నిపర్ డాగ్స్ సహయంతో తనిఖీలు చేస్తున్నారు.

Also Read: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు.. అరెస్టు తప్పదా..?

ఈ క్రమంలోనే హైదరాబాదు ఎస్సాఆర్ నగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అశోక్ యాదవ్ అనే వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నట్టు టీ న్యాబ్ పోలిసులకు సమాచారం అందింది. డ్రగ్స్ విక్రయించడానికి అశోక్ ప్రయత్నిస్తుండగా మైత్రివనం వద్ద అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతనిచ్చిన సమాచారం ఆధారంగా రాజేష్, సాయి చరణ్ ను అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్.. ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తూ అమీర్పేట్ లో హాస్టల్లో ఉంటున్నాడు. గోవాకు పలుమార్లు వెళ్లిన ముగ్గురు.. అదే సమయంలో డ్రగ్స్ అలవాటుపడ్డారు. అయితే, నగరంలో డ్రగ్స్ కు ఉన్న డిమాండ్ తో సైకో ట్రోపిక్ ఎక్టసి పిల్స్ విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గోవాలో బాబా అనే వ్యక్తి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిన నిందితులు నగరంలో విక్రయిస్తున్నారు. అయితే, ఈ డ్రగ్స్ దందాలో పొలిటిషన్ కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక్కో సైకో ట్రోపిక్ ఎక్టసి పిల్స్ వెయ్యి చొప్పున కొనుగోలు చేసి నగరంలో 2500కు విక్రయిస్తున్నారు రాజేష్ అండ్ గ్యాంగ్. హైదరాబాద్ తో పాటు నెల్లూరులో కూడా పిల్స్ విక్రయించారు నిందితులు. న్యూ ఇయర్ సందర్భంగా 60 సైకో ట్రోపిక్ ఎక్టసి పిల్స్ కొనుగోలు చేసి తీసుకువచ్చాడు సాయి చరణ్. ఇలా తీసుకొచ్చిన డ్రగ్స్ ని విక్రయించే ప్రయత్నంలో భాగంగా పోలీసులకు పట్టుబడ్డాడు అశోక్ యాదవ్. దీంతో, నిందితులు రాజేష్, సాయి చరణ్ అశోక్ యాదవ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 0.497 ఎక్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వినియోగదారులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు