అటుకులు వర్సెస్ అన్నం...ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

మనదేశంలో బియ్యం వాడకం ఎక్కువ. బియ్యంతో తయారు చేసే మరో పదార్థం అటుకులు. దీన్ని ఇంగ్లీష్‎లో పోహా అని పిలుస్తారు. వీటిని చాలా మంది అన్నానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. అయితే రెండింటి పోషకాహార జాబితాను పరిశీలిస్తే మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. పోహాలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ బియ్యం కంటే ఎక్కువ అటుకుల్లోనే ఉంది. అందుకే అటుకులు ఆరోగ్యానికి చాలా మంచివని..అన్నం కంటే పోహానే తినమని చాలా మంది పోషకాహార నిమపుణులు చెబుతారు.

అటుకులు వర్సెస్ అన్నం...ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?
New Update

భారతదేశంలో తినే ఇష్టమైన అల్పాహారాల్లో ఒకటి పోహా. ఇది జీర్ణక్రియకు తేలికగా ఉండటమే కాదు, ఉదయం అల్పాహారం కోసం కూడా ఇది ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తారు. కానీ అటుకులకు ఎలాంటి పాలిష్ చేయరు. అన్నం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. పోహా, బియ్యం రెండూ కూడా ఒక ధాన్యం నుంచి తయారు చేస్తారు. అయినప్పటికీ వీటి మధ్య తేడా ఎందుకు?

poha vs rice

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పోహాలో కేలరీల స్థాయి బియ్యం కంటే తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే పోహాను ఆరోగ్యకరమైందిగా పరిగణిస్తారు. మీరు పోహా, అన్నం రెండింటినీ ఇష్టపడితే, వాటి పోషక విలువలలో తేడా ఏమిటో తప్పనిసరిగా తెలుసుకోవాలి.

పోషకాహార నిపుణులు ఏమంటున్నారు?
పోహాను పాలీష్ చేయరు. దానిలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పోహాలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత ప్రమాదం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. బియ్యం నుండి పోహా తయారు చేయడం వల్ల ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. ఐరన్ కంటెంట్ పెంచడానికి మీరు పోహాలో నిమ్మరసాన్ని కలుపుకుని తినవచ్చు. ఇది ప్రోబయోటిక్‌గా పనిచేయడమే కాకుండా గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

పోహా వర్సెస్ రైస్:

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది:

పోహాలో బియ్యం కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఎందుకంటే దీన్ని పాలిష్ చేయరు. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడానికి, ఆకలిని తగ్గించడంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచేందుకు ఫైబర్ చాలా ముఖ్యమైనది. పోహాలో ఉండే అధిక మొత్తంలో ఫైబర్ మీ కడుపును ఎక్కువ సమయం నిండుగా ఉంచుతుంది.

ఐరన్ రిచ్ ఫుడ్:

పోహాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఐరన్ చాలా ముఖ్యం. ఇది రక్తహీనత వంటి ప్రాణాంతక పరిస్థితులను నివారిస్తుంది. అందువల్ల, ఐరన్ లోపం ఉన్నవారు, పోహా తినడం మంచిది.

కేలరీలు తక్కువ:

వండిన అన్నంతో పోలిస్తే పోహాలో కేలరీలు చాలా తక్కువ. ఇది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. చాలా తేలికగా ఉంటుంది.

పోహా వండటం చాలా సులభం:

అన్నంతో పోలిస్తే, అల్పాహారంలో పోహా ఎక్కువగా తింటారు. పోహాను వండటం చాలా సులభం. పోహా ఉప్మాను చాలా మంది ఇష్టంగా తింటారు. అందులో కూరగాయలను కూడా జోడించుకోవచ్చు. కొంచెం మసాల దినుసులు యాడ్ చేసుకుంటే రుచి అదిరిపోతుంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe