PM Modi: సామాన్యుడి ఇంటికి ప్రధాని మోదీ.. ఓ కప్పు టీ తాగి సరదాగా ముచ్చట్లు..

అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఓ సామాన్యుడి ఇంటికి వెళ్లారు. ఉజ్వల పథకంలో పదో కోటి లబ్ధిదారు అయిన ఆ ఇంటి మహిళ చేతితో పెట్టిచ్చిన టీ తాగారు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు ప్రధాని మోదీ.

New Update
PM Modi: సామాన్యుడి ఇంటికి ప్రధాని మోదీ.. ఓ కప్పు టీ తాగి సరదాగా ముచ్చట్లు..

PM Modi in Ayodya: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PM Ujjwala Yojana) పథకంలో పదో కోటి లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. గా ఉన్న ఓ మహిళ ఇంటికి ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఈరోజు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆ ఇంటి మహిళ గ్యాస్ స్టౌపై టీ చేసి పెట్టింది. టీ తాగిన అనంతరం.. ఉజ్వల పథకంలో భాగంగా గ్యాస్ అందక ముందు.. అందిన తరువాత పరిస్థితి ఎలా ఉందని లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు ప్రధాని మోదీ.

గ్యాస్ వినియోగానికి ముందు తాము కట్టెలు, బొగ్గు, ఆవు పేడ పిడకలతో వంట చేసుకునేవారమని ఆ ఇంటి సభ్యులు తెలిపారు. ఉజ్వల పథకంలో తమ జీవన విధానమే మారిపోయిందన్నారు. ఎల్‌పీజీ సిలిండర్ల ద్వారా స్వచ్ఛమైన వంట ఇంధనం అందుతోందన్నారు. సాంప్రదాయ వంట ఇంధనాలను ఉపయోగించడం వల్ల గ్రామీణ మహిళలు అనారోగ్యానికి గురవడంతో పాటు.. పర్యావరణంపైనా ఎఫెక్ట్ పడుతోంది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్, స్టౌవ్ అందిస్తో్ంది. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్స్ పంపిణీ చేశారు.

కాగా, అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీ ఘన స్వాగతం లభించింది. అయోధ్య ప్రజలు భారీగా తరలి వచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ బాలుడు పెయింటింగ్ చూపించగా.. తన ఆటోగ్రాఫ్ ఇచ్చారు ప్రధాని మోదీ. కాగా, ఇవాళ అయోధ్యలో రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇదే సమయంలో రెండు అమృత్ భారత్‌, ఆరు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. దీంతోపాటు.. అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ.

Also Read:

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

దూర ప్రయాణం చేస్తున్నారా? వీటిని పాటిస్తే ఏ సమస్యా ఉండదు..!

Advertisment
తాజా కథనాలు