PM Modi: సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నాం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన..

ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వినాయక చవితి పర్వదినాన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకే సభ ప్రారంభం కానుండగా.. ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు.

New Update
PM Modi: సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నాం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన..

PM Modi on Parliament Special Session: ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ప్రకటించారు. వినాయక చవితి పర్వదినాన పార్లమెంట్(Parliament) ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకే సభ ప్రారంభం కానుండగా.. ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ పార్లమెంట్‌ సెషన్స్‌లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నామని తెలిపారు. ఈ పార్లమెంట్ భవనం చారిత్రక కట్టడం అని, పార్లమెంట్ దేశ ప్రతిష్టను పెంపొందించిందన్నారు. ఈ పార్లమెంట్ వేదికగానే.. నేడు కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.

చంద్రయాన్ - 3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించామన్న ప్రధాని మోదీ.. జీ-20 సమావేశాలను సైతం విజయంతంగా నిర్వహించుకున్నామన్నారు. జీ-20 విజయాన్ని ప్రపంచాధినేతలు ప్రశంసించారని పేర్కొన్నారు. భారతదేశం సత్తా ఏంటో చూపించామన్నారు. భారత పురోగతిని ప్రపంచం అంతా కొనియాడుతోందన్నారు. సకల వసతులతో యశోభూమిని నిర్మించుకున్నామని తెలిపారు ప్రధాని మోదీ. పార్లమెంట్ భవనంపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోందన్నారు. దేశ వ్యాప్తంగా నూతన ఉత్సాహం వెల్లివిరిస్తోందన్నారు.

5 రోజులు పార్లమెంట్ సమావేశాలు..

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి అంటే (సోమవారం - సెప్టెంబర్ 18) నుంచి ప్రారంభం కానున్నాయి. మొదట ప్రత్యేక సమావేశం అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తరువాత సాధారణ సమావేశాలేనని క్లారిటీ ఇచ్చింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు నేటి నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనుంది. సభా కార్యక్రమాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి. ఈ సెషన్‌లో 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణంపై చర్చించాలని, ఎన్నికల కమిషనర్ల నియామకంతో పాటు నాలుగు బిల్లులను పరిశీలించాలని కేంద్రం ప్రతిపాదించింది.


Also Read:

Ganesh Chaturthi 2023: పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్య.. చూస్తే వావ్ అనాల్సిందే..

Andhra Pradesh: నేడు తిరుమలకు సీఎం జగన్.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ..

Advertisment
Advertisment
తాజా కథనాలు