Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ ఎక్కడుందో తెలుసా..? విశేషాలివే

ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయ కేంద్రమైన 'సూరత్ డైమండ్ బోర్స్‌'ను ప్రధాని మోదీ రేపు(డిసెంబర్ 17) ప్రారంభించనున్నారు. 35.54 ఎకరాల్లో రూ. 3,400 కోట్లతో నిర్మించిన ఈ విశాలమైన కాంప్లెక్స్‌లో 4,500 పైగా ఇంటర్‌కనెక్టడ్ కార్యాలయాలున్నాయి.

Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ ఎక్కడుందో తెలుసా..? విశేషాలివే
New Update

కార్పొరేట్‌, వ్యాపార రంగాల్లో ఇండియా దూసుకుపోతోంది. ఇటు నిర్మాణాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. దేశంలో నిర్మితమవుతున్న భవనాలు చాలా అడ్వెన్స్‌గా ఉంటున్నాయి. టెక్నాలజీని జోడించి పెద్ద పెద్ద బిల్డుంగులు కడుతుండడంతో యావత్ ప్రపంచం చూపు ఇండియావైపే ఉంటోంది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. సూరత్ డైమండ్ బోర్స్(Surat Diamond Bourse) ప్రారంభానికి రెడీ అయ్యింది.

రూ.3,400 కోట్ల ఖర్చు:
ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ 'సూరత్ డైమండ్ బోర్స్'ను రేపు(డిసెంబర్‌ 17) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రారంభించనున్నారు. రూ. 3,400 కోట్ల వ్యయంతో 35.54 ఎకరాల స్థలంలో ఈ సూరత్ డైమండ్ బోర్స్‌(SDB)ను నిర్మించారు. రఫ్‌ డైమాండ్‌తో పాటు మెరుగుపెట్టిన వజ్రాల(Diamond) వ్యాపారానికి ఇది గ్లోబల్ హబ్‌గా మారనుంది.


పెంటగాన్‌ కంటే పెద్దది:
సూరత్ డైమండ్ బోర్స్ కేవలం ఒక భవనం కాదు.. ఇది ఒక నిర్మాణ అద్భుతం..! 4,500 పైగా ఇంటర్‌కనెక్టడ్ కార్యాలయాలను కలిగి ఉన్న భవనం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌కనెక్టడ్ భవనం. పరిమాణంలో ఐకానిక్ పెంటగాన్‌ను అధిగమించింది. ఈ భారీ నిర్మాణం దేశానికి అతిపెద్ద కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్‌గా కూడా గుర్తింపు పొందింది.

లక్షల ఉద్యోగాలు:
ఈ బిల్డింగ్‌ ప్రారంభోత్సవం తర్వాత లక్షల మంది ఉపాధి పొందే అవకాశం ఉంది. 175 దేశాల నుంచి 4,200 మంది వ్యాపారులకు వసతి కల్పించే సామర్థ్యంతో, సూరత్ డైమండ్ బోర్స్ ప్రపంచ వజ్రాల వాణిజ్యానికి కేంద్రంగా ఉండనుంది. ఈ ప్రతిష్టాత్మక వెంచర్ సుమారు 1.5 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వజ్రాల కొనుగోలుదారుల బిజినేస్‌ చేసుకోవడానికి ఇది అది పెద్ద వేదికగా నిలవనుంది.


ఇప్పటికే బుకింగ్‌:
ప్రారంభోత్సవానికి ముందే ముంబైకి చెందిన చాలా మంది వజ్రాల వ్యాపారులు తమ కార్యాలయాలను బుక్‌ చేసుకున్నారని SDB మీడియా కోఆర్డినేటర్ దినేష్ నవాదియా ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని వేలం తర్వాత యాజమాన్యం కేటాయించింది. ప్రారంభోత్సవం తర్వాత మోదీ ఎస్‌డిబి భవన్ దగ్గర భారీ ఎత్తున ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. డైమండ్ రీసెర్చ్ అండ్‌ మర్కంటైల్ సిటీలో ఉన్న సూరత్ డైమండ్ బోర్స్ ప్రధాని మోదీ ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్‌లలో భాగం. రేపే ఆయన దీన్ని ప్రారంభిస్తారు. ముంబై సాంప్రదాయకంగా డైమండ్ ఎగుమతులలో స్పాట్‌లైట్‌ను కలిగి ఉండగా.. సూరత్‌.. 'డైమండ్ సిటీ' ప్రాసెసింగ్ కోసం పవర్‌హౌస్‌గా నిలుస్తోంది.

Also Read: ముంబై జెర్సీ తగలబెట్టిన రోహిత్‌ అభిమాని.. ట్విట్టర్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు!

WATCH:

#narendra-modi #surat #surat-diamond-bourse
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe