Modi: పార్లమెంట్‌లో సోనియాని పలకరించిన మోదీ..ఆరోగ్యం ఎలా ఉందని ఆరా! పార్లమెంట్ సమావేశాల తొలిరోజు ఆసక్తికర ఘటన జరిగింది. సోనియాగాంధీని నేరుగా కలిసి పలకరించారు ప్రధాని మోదీ. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. By Trinath 20 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి రాజకీయ ప్రత్యర్థులే అవొచ్చు.. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండొచ్చు.. శూలాల్లాంటి మాటలతో పరస్పర నిందలు, ప్రతినిందలు వేసుకుంటూ ఉండొచ్చు..రాజకీయ చదరంగంలో నువ్వా నేనా అన్నట్టు తలపడే సోనియా గాంధీ(sonia gandhi), మోదీ(Modi) వ్యక్తిగతంగా మాత్రం ఒకరినొకరు గౌరవించుకుంటారు. తాజాగా పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన జరిగింది. ప్రధాని మోదీ నేరుగా సోనియా గాంధీ వద్దకు వెళ్లి ఆమెను పలకరించారు. ఫైల్ ఆరోగ్యం బాగొకున్నా: సోనియా గాంధీకి చాలా కాలంగా అనారోగ్య సమస్యలున్నాయి. గతంలో ఉన్న విధంగా చురుగ్గా ఆమె రాజకీయ సమావేశాలకు హాజరుకావడం లేదు. తప్పనిసరి మీటింగ్‌లకు వస్తున్నారే కానీ మునపటిలాగా ఆమె ప్రజాజీవితంలో ఎక్కువగా కనిపించడంలేదు. శ్వాసకోస ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఇక రెండు రోజుల క్రితం యాంటీ-బీజేపీ మిత్రపక్షాల భేటీకి సోనియా హాజరయ్యారు. మిగిలిన పార్టీలతో కలిసి భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. UPAపేరును INDIAగా మార్చిన ఈ మీటింగ్‌కి 26రాజకీయ పార్టీలు అటెండ్ అయ్యాయి. రెండు రోజుల మీటింగ్ తర్వాత తిరిగి ఢిల్లీకి ప్రయాణమైన సోనియా ఇవాళ పార్లమెంట్ సమావేశాలకు వచ్చారు. రాహుల్ ట్వీట్ వైరల్: INDIA మిత్రపక్షాల భేటి తర్వాత సోనియా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆక్సిజన్ మాస్కు పెట్టుకున్నారు. ఈ ఫొటోను తనయుడు రాహుల్ గాంధీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. 'తీవ్ర ఒత్తిడిలోనూ ధైర్యంగా ఉన్న అమ్మ' అంటూ రాహుల్ క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇదే క్రమంలో పార్లమెంట్ సమావేశంలో మొదలవడం..అక్కడ సోనియాను మోదీ పలకరించడం జరిగింది. పార్లమెంట్ సమావేశాలు వాయిదా: మణిపూర్ నిరసనలు, ఆగ్రహావేశాల మధ్య వర్షాకాల సమావేశాల తొలిరోజే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. 15 మంది ప్రతిపక్ష ఎంపీలు మణిపూర్ హింసపై చర్చించాలని కోరారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తాజా పరిణామాలపై చర్చించారు. మణిపూర్‌పై పార్లమెంటు ఉభయసభల్లో చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. లోక్‌సభ ఉపనేత రాజ్‌నాథ్‌సింగ్ కూడా ఇదే హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఉదయం పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో పలు ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమై వర్షాకాల సమావేశాల ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించారు. మణిపూర్‌లో రెండు నెలలుగా కొనసాగుతున్న హింసాకాండలో 80 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.అటు వర్షాకాల సమావేశాల్లో 31 బిల్లులు చేపట్టేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌ను రూపొందించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు కొనసాగనుండగా.. మొత్తం 17 సమావేశాలు జరగనున్నాయి. సెషన్ పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభమైంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి