/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/international-yoga-day-2023.webp)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్న సంగతి తెలిసిందే. జూన్ 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. నేడు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా..మోడీ ఓ సందేశాత్మక వీడియోను ట్వీట్ చేశారు. ఇప్పుడు యోగా ప్రపంచాన్ని మార్చేసిందని..వసుదైన కుటుంబం అనే థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగా చేస్తున్నారని మోడీ తెలిపారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మంగళవారం మోడీ ఓ వీడియోను విడుదల చేశారు. దీనిని ట్విట్టర్ లో పోస్టు చేశారు.
Sharing my message on International Day of Yoga. https://t.co/4tGLQ7Jolo
— Narendra Modi (@narendramodi) June 21, 2023
యూఎన్ఓ ప్రధాన కార్యాలయంలో నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నాయకత్వం, అంతర్జాతీయ సమాజ సభ్యులతో కలిసి మోడీ జరుపుకోనున్నారు. అయితే పురాతన భారతీయ అభ్యాసనం ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు భారత్ లోని పలు ప్రాంతాల్లో యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.