508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన

దేశంలోని రైల్వేస్టేషన్ల అధునీకరణకు రంగం సిద్ధమైంది. ఆగస్టు 6న ప్రధాని మోదీ అభివృద్ధి పనులకు వర్చువల్ విధానం శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద రూ.24,470 కోట్ల వ్యయంతో కేంద్రం ఈ పనులకు శ్రీకారం చుట్టనుంది.

508 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. ఆగస్ట్ 6న మోదీ శంకుస్థాపన
New Update

సిటీ సెంటర్స్‌గా అభివృద్ధి..

దేశంలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లో అమృత్ భారత్ స్టేషన్ స్కీం ప్రవేశపెట్టింది. ఆగస్ట్ 6న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని 508 రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అమృత్ భారత్ స్కీమ్ కింద రూ.24,470 కోట్ల వ్యయంతో కేంద్రం ఈ పనులకు శ్రీకారం చుట్టనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి పనులకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. ఈ స్టేషన్లను సిటీ సెంటర్స్‌గా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నారు.

1309 స్టేషన్లు ఆధునికీకరణ.. 

రైల్వేస్టేషన్ చుట్టూ నగరం లేదా పట్టణ అభివృద్ది కేంద్రీకృతమై ఉండేలా సమగ్ర దృష్టితో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుకు ప్రాధాన్యత ఇచ్చేలా స్టేషన్ భవనం రూపకల్పన చేయనున్నారు. దేశంలో అత్యాధునిక ప్రజా రవాణా సదుపాయాలపై మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా ప్రజా రవాణాకు రైల్వేలు ప్రాధాన్యతనిస్తున్నాయని.. రైల్వేస్టేషన్‌లలో ప్రపంచస్థాయి సౌకర్యాలు అందించాల్సి అవసరం ఉందని మోదీ తెలిపారు. ప్రధాని సూచనలకు అనుగుణంగా దేశంలోని 1309 స్టేషన్‌లను ఆధునికీకరణ చేసేందుకు అమృత్ భారత్ స్టేషన్ పథకం తీసుకువచ్చారు. ఇందులో దేశవ్యాప్తంగా 508 స్టేషన్లను తీసుకువచ్చారు. ఈ స్టేషన్లు అన్ని దేశంలోని 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి.

తెలంగాణలో 21.. ఏపీలో 18.. 

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాలలో 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22 స్టేషన్లు ఉన్నాయి. గుజరాత్ , తెలంగాణలలో 21, జార్ఖండ్‌లో 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 18, హర్యానాలో 15, కర్నాటకలో 13 ఉన్నాయి. ఈ ఆధునికీకరణ పనుల ద్వారా రైల్వేస్టేషన్‌లలో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందించనున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ సర్క్యూలేషన్, ఇంటర్ మోడల్ ఇంటిగ్రేషన్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైల్వేస్టేషన్‌లలో విశాలమైన ప్లాట్‌ఫాంలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణలోని రైల్వేస్టేషన్లు కొత్త రూపును సంతరించుకోనున్నాయని కేంద్రమంత్రి, టీబీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 21 రైల్వేస్టేషన్లలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ నెల 6 వ తేదీన శంకుస్థాపన చేయనున్నారని ట్వీట్ చేశార. రూ.894 కోట్ల అంచనా వ్యయంతో ఆయా రైల్వేస్టేషన్లలో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారని వెల్లడించారు. 

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe