Ayodhya Ram Mandir: యావత్ ప్రపంచ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నఅయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవం మరో 11 రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఓ కీలక ప్రకటన చేశారు. ఈ 11 రోజుల పాటు కూడా తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని (దీక్ష) అనుసరిస్తానని వెల్లడించారు.
దీనికి సంబంధించి మోడీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ (Youtube Channel) లో ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించే అవకాశం తనకు రావడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు మోడీ చెప్పుకొచ్చారు. అయోధ్య రామమందిర ఆలయాన్ని జనవరి 22 న మోడీ ప్రారంభించనున్నారు.
వారం రోజుల ముందు నుంచే...
శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన క్రతువులు , ప్రధాన కార్యక్రమానికి వారం రోజుల ముందు నుంచే అంటే మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానకిఇ సుమారు 4 వేల మందికి పైగా సాధువులతో పాటు ఎందరో రుషులు కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం.
అమృత్ మహోత్సవ్...
అయోధ్యలో ఈ నెల 14 నుంచి 22 వరకూ కూడా అమృత్ మహోత్సవ్ పేరిట రోజూ ప్రత్యేక కార్యక్రమాలను సైతం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో 22న బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు విచ్చేయుచున్న భక్తుల కోసం రామ జన్మభూమి ట్రస్ట్ వారు ప్రత్యేక వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 15 వేల మందికి బస ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్ సభ్యులు వివరించారు.
Also read: మాల్దీవులు – భారత్ వివాదం నేపథ్యంలో ”ఈజ్ మై ట్రిప్” కీలక ప్రకటన!