PM Modi: రాజ్యసభలో గందరగోళం.. కాంగ్రెస్ తమ విజయాన్ని ఓర్వడం లేదన్న మోదీ కాంగ్రెస్ పార్టీ తమ విజయాన్ని ఓర్వలేకపోతుందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఈ రోజు లోక్ సభలో విపక్షాల ఆందోళనల మధ్యే ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. మరో 20 ఏళ్లు తమమే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. By Nikhil 03 Jul 2024 in రాజకీయాలు ట్రెండింగ్ New Update షేర్ చేయండి రానున్న రోజుల్లో భారత్ ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాద తీర్మానంపై ప్రధాని ప్రసంగిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామన్నారు. తమకంటే ముందే రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని ప్రస్తుత ప్రతిపక్షం నడిపిందని కాంగ్రెస్ పై విమర్శల దాడి చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు మోదీ. విపక్షాల నిరసనల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. విపక్షాలు పెద్దల సభను అవమానిస్తున్నాయని ఫైర్ అయ్యారు. తమ విజయాన్ని కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని ధ్వజమెత్తారు. నిజాలు చెబితే విపక్షాలు భరించలేకపోతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు తమపై చూపిన విశ్వాసంపై గర్వంగా ఉందన్నారు. అయితే ప్రతిపక్షాలు మోదీ ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశాయి. రాజ్యాంగం అంటే కేవలం ఆర్టికల్స్‌ను ఫాలో అవడం మాత్రమే కాదన్నారు మోదీ. రాజ్యాంగం లైట్‌హౌస్‌లా దేశానికి మార్గనిర్దేశం చేస్తుందన్నారు. మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోందన్నారు మోదీ. ఈ నేపథ్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరపాలన్నారు. మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటాం.. తామ ప్రభుత్వం మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఓ కాంగ్రెస్ నేత తమను మూడో వంతు ప్రభుత్వం అంటూ విమర్శిస్తున్నాడన్నారు. అయితే.. అది నిజమేనని తనదైన శైలిలో మోదీ స్పందించారు. తాము పదేళ్ల పాలన పూర్తి చేసుకున్నామన్నారు. మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ లెక్కన మూడో వంతు ముగిసిందన్నారు. ఇంకా రెండు వంతులు మిగిలి ఉందని కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు ప్రధాని. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి