జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పీటిఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 2047 నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశం అవుతుందని స్పష్టంచేశారు. దేశంలో అవినీతి, కులం, మతతత్వానికి దేశంలో స్థానం ఉండదన్నారు.
ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..
➨ అక్రమ ఆర్థిక కార్యకలాపాలు, ఉగ్రవాదంపై పోరుకు సైబర్‌స్పేస్ పూర్తిగా కొత్త కోణాన్ని పరిచయం చేసింది.
➨ బెంగుళూరులోని ISTRAC నుండి సూర్యుడిపై ఆదిత్య L1 ప్రయోగం విజయవంతంగా చేయబడింది.
➨ సైబర్ నేరాలపై పోరాటంలో గ్లోబల్ సహకారం అనివార్యం
➨ 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది
➨ అవినీతి, కులం, మతతత్వానికి దేశంలో స్థానం ఉండదు
➨ G20లో మన మాటలు, దార్శనికత ప్రపంచానికి భవిష్యత్తు కోసం రోడ్‌మ్యాప్‌గా పరిగణించబడుతుంది
➨ చాలా కాలంగా భారతదేశంలో ఒక్క బిలియన్ మంది ఆకలితో సతమతమయ్యే దేశంగా ఉండేది
➨ ఇప్పుడు నైపుణ్యం కలిగిన దేశంగా మారింది
➨ రాబోయే వెయ్యి సంవత్సరాలకు గుర్తుండిపోయే వృద్ధికి పునాది వేయడానికి భారతీయులకు గొప్ప అవకాశం దొరికింది
➨ భారతదేశం సమీప భవిష్యత్తులో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలోకి వస్తుంది
➨ దశాబ్దం లోపు ఐదు స్థానాలు ఎగబాకిన భారత్ ప్రస్తుతం ఐదో స్థానానికి చేరుకుంది
➨ కాశ్మీర్, అరుణాచల్‌లో జీ20 సమావేశాలపై పాకిస్థాన్, చైనాల అభ్యంతరాలను తోసిపుచ్చారు
➨ దేశంలోని ప్రతి ప్రాంతంలో సమావేశాలు నిర్వహించడం సహజమన్నారు
➨ వివిధ ప్రాంతాలలో విభిన్న వైరుధ్యాలను పరిష్కరించడానికి చర్చలు, దౌత్యం మాత్రమే మార్గమని రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు