Modi invites Biden: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జో బిడెన్.. ఆహ్వానించిన ప్రధాని మోదీ.. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతితిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను ఆహ్వానించారు భారత ప్రదాని నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ వెల్లడించారు. By Shiva.K 21 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PM Modi invites US President Biden: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతితిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden)ను ఆహ్వానించారు భారత ప్రదాని నరేంద్ర మోదీ(PM Modi). ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా(America) రాయబారి ఎరిక్ గార్సెట్టీ వెల్లడించారు. జి20లో భాగంగా ద్వైపాక్షిక సమావేశంలో మాట్లాడిన భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ.. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. అయితే, గణతంత్ర దినోత్సవ వేడుకలకు క్వాడ్ దేశాల నేతలను ఆహ్వానించడాన్ని భారత్ పరిశీలిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అమెరికాకు ఆహ్వానం అందిందా? అంటూ మీడియా ప్రతినిథులు అమెరికా రాయబారిని ప్రశ్నించారు. దీనికి స్పందించిన గార్సెట్టీ.. జీ20 సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ను ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారని తెలిపారు. ఇటీవల ముగిసిన G20 సమ్మిట్‌లో ఇరువురు నేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ బిడెన్‌కు ఆహ్వానం పంపినట్లు గార్సెట్టి పేర్కొన్నారు. కాగా, భారతదేశం - యుఎస్ ఏడవ, చివరి అత్యుత్తమ ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వివాదాన్ని కూడా పరిష్కరించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా, ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో గతంలో ఉన్న ఆరు వివాదాలు పరిష్కరించడం జరిగిందన్నారు. కాగా, ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి కూడా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రతి సంవత్సరం, గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని ప్రపంచ నాయకులను భారత్ ఆహ్వానిస్తుంది. అయితే, COVID-19 మహమ్మారి దృష్ట్యా 2021, 2022లో రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిని ఎవరినీ పిలవలేదు. కాగా, 2020లో అప్పటి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2019లో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2018లో మొత్తం 10 ఆసియాన్ దేశాల నాయకులు వేడుకలకు హాజరయ్యారు. 2017లో, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కాగా, 2016లో అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ వేడుకలకు హాజరయ్యారు. 2014లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కాగా, 2013లో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ హాజరయ్యారు. జీ-20 సమావేశంలో బైడెన్ తో ప్రధాని మోదీ భేటీ.. జీ-20 సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సమయంలో అనేక అంశాలపై చర్చలు జరిపారు. ఇదే సమయంలోనూ.. భారత గణతంత్య్ర వేడుకలకు హాజరవ్వాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. Happy to have welcomed @POTUS @JoeBiden to 7, Lok Kalyan Marg. Our meeting was very productive. We were able to discuss numerous topics which will further economic and people-to-people linkages between India and USA. The friendship between our nations will continue to play a… pic.twitter.com/Yg1tz9kGwQ — Narendra Modi (@narendramodi) September 8, 2023 Also Read: Andhra Pradesh Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బాబు అరెస్ట్ నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠ T20 World Cup 2024 Venues: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ20 ప్రపంచకప్‌పై కీలక ప్రకటన #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి