Indian Navy: ఇక చైనాకు దబిడి దిబిడే.. నేవీ దూకుడు.. క్రూయిజ్ మిస్సైల్ వచ్చేస్తోంది!

200కు పైగా బ్రహ్మోస్ ఎక్స్‌టెండెడ్-రేంజ్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.19,000 కోట్ల అంచనతో ఈ డీల్‌ను కుదుర్చుకోనుంది. బ్రహ్మోస్ ఏరోస్పేస్, డిఫెన్స్ మినిస్ట్రీ మధ్య మార్చి మొదటివారంలో డీల్‌ కుదరనుంది.

New Update
Indian Navy: ఇక చైనాకు దబిడి దిబిడే.. నేవీ దూకుడు.. క్రూయిజ్ మిస్సైల్ వచ్చేస్తోంది!

Brahmos:  200 బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు ఒప్పందంపై కేబినేట్‌ త్వరతిగిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్షిపణుల కొనుగోలుకు కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారత నౌకాదళం కోసం బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కొనుగోలు చేయనుంది. ఈ మిస్సైల్స్‌ను యుద్ధనౌకలలో మోహరిస్తారు. ఈ డీల్ విలువ రూ.19 వేల కోట్లు.

రష్యా సాయంతో:
మార్చి మొదటి వారంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్, డిఫెన్స్ మినిస్ట్రీ మధ్య డీల్ కుదిరే అవకాశం ఉందని సమాచారం. భారత్‌కు, రష్యా ప్రభుత్వాల మధ్య బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఓ జాయింట్ వెంచర్‌గా ఉంది. ఇది బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తుంది. ఈ క్షిపణులను జలాంతర్గాములు, యుద్ధనౌకలు, విమానాలు, భూమి నుంచి కూడా ప్రయోగించవచ్చు. భారత నౌకాదళం ప్రధాన ఆయుధం బ్రహ్మోస్ క్షిపణి. రష్యా సహాయంతో భారత్‌లో బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేశారు. ఈ మిస్సైల్‌లోని చాలా భాగాలు దేశంలోనే తయారు చేశారు. ఇక భారత్ త్వరలో ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేయనుంది. దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన మొదటి విదేశీ కస్టమర్ దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది.

ఎగుమతులపై ఫోకస్:
దక్షిణాసియాలోని అనేక ఇతర దేశాలు కూడా బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌తో బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం విలువ దాదాపు 375 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 2025 నాటికి ఆయుధాల ఎగుమతి లక్ష్యాన్ని ఐదు బిలియన్ డాలర్లకు చేరుకోవాలనిబ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రయత్నిస్తోంది. ఆయుధాల ఎగుమతులను ఐదు బిలియన్ డాలర్లకు పెంచాలని అటు ప్రధాని మోదీ కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం తర్వాత ఆకాష్ క్షిపణి, హోవిట్జర్ లాంటి ఆయుధాలను ఎగుమతి చేసే అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. వీటిని ఇండియాలోనే అభివృద్ధి చేస్తున్నారు. ఆయుధాల ఎగుమతులను ప్రోత్సహించేందుకు, రక్షణ మంత్రిత్వ శాఖ తన ఆయుధాల హార్డ్‌వేర్ నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోంది. అంతేకాకుండా భారతీయ కంపెనీలు కూడా తమ కార్యాలయాలను విదేశాలలో ఓపెన్ చేశాయి.

Also Read: మహిళల కోసం స్పెషల్‌ స్కీమ్‌.. పెట్టుబడికి ఈ పథకం బెస్ట్!

WATCH:

Advertisment
తాజా కథనాలు