PM MODI: ట్రక్కు డ్రైవర్లకు పీఎం మోదీ గుడ్ న్యూస్..డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలు..!!

లారీ,ట్రక్ డ్రైవర్లకు శుభవార్త చెప్పారు ప్రధాని మోదీ. డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రధాని ప్రతిపాదించారు. భోజనం చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు పార్కింగ్ సదుపాయాల ఉండేలా ఈ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

PM MODI: ట్రక్కు డ్రైవర్లకు పీఎం మోదీ గుడ్ న్యూస్..డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలు..!!
New Update

PM MODI:  లారీ,ట్రక్ డ్రైవర్లకు శుభవార్త చెప్పారు ప్రధాని మోదీ. డ్రైవర్ల కోసం హైవేలపై ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని మోదీ  ప్రతిపాదించారు. శుక్రవారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024కి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని అనంతరం ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ ఆటోమోటివ్ ఎకోసిస్టమ్‌లో డ్రైవర్ల ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు.డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంబడి త్వరలో 1000 కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. భోజనం చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి పార్కింగ్ సదుపాయాలు ఉండేలా ఈ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తామన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

ట్రక్, టాక్సీ డ్రైవర్లు మన సామాజిక , ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగమని ప్రధాని మోదీ తన ప్రసంగంలో అన్నారు. డ్రైవర్లు కొన్నిసార్లు గంటల తరబడి ట్రక్కులు నడుపుతూ ఉంటారు. ఈ సమయంలో వారు అస్సలు విశ్రాంతి తీసుకోలేరు. డ్రైవర్ల ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద అన్ని జాతీయ రహదారుల వెంబడి ఆధునిక భవనాలు నిర్మించనున్నారు. డ్రైవర్లు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారన్నారు.

భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో మొబిలిటీ రంగం పెద్ద పాత్ర పోషిస్తుంది:
2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా వేగంగా దూసుకుపోతోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో మొబిలిటీ రంగానికి పెద్ద సహకారం ఉంది. దీంతో పాటు తొలి ప్రభుత్వ హయాంలో గ్లోబల్ లెవల్ మొబిలిటీ కాన్ఫరెన్స్ నిర్వహించామని తెలిపారు. ఇందులో బ్యాటరీలు, ఈవీల గురించి కూలంకషంగా చర్చించారు. నేను రెండవ టర్మ్‌లో వేగవంతమైన పురోగతిని చూస్తున్నాను అని మోదీ అన్నారు. ఎర్రకోట ప్రాకారాల మీద నుంచి 'Yahi Samay, Sahi Samay hai' అనే మాటను అన్నానని.. దేశ ప్రజల సామర్ధ్యాల వల్లే ఆ మాటలు అన్నాను అంటూ మోదీ తెలిపారు. నేడు భారత ఆర్ధిక వ్యవస్ధ వేగంగా విస్తరిస్తోందని.. మన ప్రభుత్వ హయాంలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించనుందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

#business-news #prime-minister-narendra-modi #truck-driver
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe