అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానిమోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో గురువారం సమావేశమయ్యారు. ప్రధాని మోడీకి అధ్యక్షుడు బిడెన్, ఆయన భార్య జిల్ బిడెన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా ఇచ్చారు. ఈ గ్రీన్ డైమండ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో తయారు చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక క్యారెట్‌కు 0.028 గ్రాముల కార్బన్‌ను మాత్రమే విడుదల చేస్తుంది. ఈ వజ్రాన్ని కాగితం గుజ్జుతో తయారు చేసిన బాక్సులో పెట్టి గిఫ్టుగా అందించారు. జెమోలాజికల్ ల్యాబ్, IGIచే ధృవీకరించారు. దీనితో పాటు గంధపు పెట్టెల వెండి ప్రతిమ, నూనె దీపాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..జిల్ బిడెన్‌కు ప్రధాని మోడీ స్పెషల్ గిఫ్ట్..దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ దంపతులకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. గురువారం వైట్ హౌజ్ మోడీ గౌరవార్థం జోబిడెన్ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు. చేతితో తయారు చేసిన చందనం పెట్టె, గ్రీన్ కలర్ వజ్రాన్ని జిల్ బిడెన్ కు బహుమతిగా మోడీ అందించారు. గంధపు పెట్టెలో వెండి వినాయకుడి ప్రతిమ, నూనె దీపాలు కూడా ఉన్నాయి.

Translate this News: