జిల్ బిడెన్‎కు ప్రధాని మోడీ స్పెషల్ గిఫ్ట్..దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ దంపతులకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. గురువారం వైట్ హౌజ్ మోడీ గౌరవార్థం జోబిడెన్ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు. చేతితో తయారు చేసిన చందనం పెట్టె, గ్రీన్ కలర్ వజ్రాన్ని జిల్ బిడెన్ కు బహుమతిగా మోడీ అందించారు. గంధపు పెట్టెలో వెండి వినాయకుడి ప్రతిమ, నూనె దీపాలు కూడా ఉన్నాయి.

New Update
జిల్ బిడెన్‎కు ప్రధాని మోడీ స్పెషల్ గిఫ్ట్..దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానిమోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో గురువారం సమావేశమయ్యారు. ప్రధాని మోడీకి అధ్యక్షుడు బిడెన్, ఆయన భార్య జిల్ బిడెన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా ఇచ్చారు. ఈ గ్రీన్ డైమండ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో తయారు చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక క్యారెట్‌కు 0.028 గ్రాముల కార్బన్‌ను మాత్రమే విడుదల చేస్తుంది. ఈ వజ్రాన్ని కాగితం గుజ్జుతో తయారు చేసిన బాక్సులో పెట్టి గిఫ్టుగా అందించారు. జెమోలాజికల్ ల్యాబ్, IGIచే ధృవీకరించారు. దీనితో పాటు గంధపు పెట్టెల వెండి ప్రతిమ, నూనె దీపాలు ఉన్నాయి.

pm modi gave special gift to first lady jill biden

ఇక జో బిడెన్ దంపతులు.. 20వ శతాబ్దం ప్రారంభంలో చేతితో తయారు చేసిన, పురాతన అమెరికన్ పుస్తక గాలీని ప్రధాని మోడీకి అందించారు. దీనితో పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను కూడా బహుమతిగా ఇచ్చారు. మొదటి కోడాక్ కెమెరా కోసం జార్జ్ ఈస్ట్‌మన్ పేటెంట్ ఆర్కైవల్ ప్రింట్, అమెరికన్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన పుస్తకం కూడా ఈ కెమెరాతో పాటు ఉన్నాయి. అదే సమయంలో, జిల్ బిడెన్ 'కలెక్టెడ్ పోయమ్స్ ఆఫ్ రాబర్ట్ ఫ్రాస్ట్' పుస్తకం మొదటి ఎడిషన్‌ను ప్రధాని మోడీకి బహుమతిగా అందించారు.

మోడీ అమెరికా పర్యటన రెండు దేశాల మధ్య పలు రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. భారత హస్తకళాకారులు తయారు చేసిన పలు అరుదైన బహుమతులను మోడీ బిన్ కు అందజేశారు. తమిళనాడు తెల్లనువ్వులు, రాజస్తాన్ హిరణ్యదాన్ గోల్డ్ కాయిన్, పంజాబ్ నుంచి సేకరించిన వెన్న, నెయ్యితోపాటు జార్ఖండ్ నుంచి తెప్చించిన వస్త్రదాన్, మహారాష్ట్రం బెల్లం, సిల్వర్ కాయిల్, గుజరాత్ ఉప్పు, కర్నాటక గంధపు ముక్క, వెస్ట్ బెంగాల్ కళాకారులు తయారు చేసిన వెండి కొబ్బరికాయ, ఉత్తరప్రదేశ్ తామ్రపత్రాలను మోడీ జోబిడెన్ దంపతులకు బహుమతిగా అందించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు