నిన్న ప్రధాన మంత్రిగా మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 30 మందికి కేబినెట్ హోదా దక్కగా.. మరో ఐదుగురు స్వతంత్ర హోదాలో ఉంటారు. మరో 36 మందికి సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు మోదీ. తాజాగా వీరికి శాఖలను కేటాయించారు. అమిత్ షాకు మళ్లీ హోంశాఖనే కేటాయించారు మోదీ. నితిన్ గడ్కరీకి సైతం మళ్లీ రవాణా శాఖనే అప్పగించారు. ఇతర మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి..
- నితిన్ గడ్కరీ- రోడ్డు రవాణా శాఖ
- అమిత్ షా-హోం శాఖ
- విదేశాంగ మంత్రి-జై శంకర్
- రాజ్ నాథ్ సింగ్-రక్షణ
- నిర్మలాసీతారామన్-ఆర్థిక శాఖ
- మనోహర్ లాల్ ఖట్టర్-పట్టణ అభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ
- హర్దీప్ సింగ్ పూరి-పెట్రోలియం
- అశ్విని వైష్ణవ్-రైల్వే, సమాచార&ప్రసార
- పీయూష్ గోయల్-వాణిజ్యం
- ధర్మేంద్ర ప్రధాన్-విద్యా శాఖ
- శ్రీపాద నాయక్-విద్యుత్
- జేపీ నడ్డా-వైద్య శాఖ
- రామ్మోహన్ నాయుడు-పౌర విమానయాన శాఖ
- బూపేంద్ర యాదవ్-పర్యావరణ
- కిరణ్ రిజుజు-పార్లమెంటరీ వ్యవహరాల శాఖ
- శివరాజ్ సింగ్ చౌహాన్-వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ
- గజేంద్రసింగ్ షెకావత్-టూరిజం
- సీఆర్ పాటిల్-జలశక్తి
- మన్సుఖ్ మాండవీయా-కార్మిక శాఖ, క్రీడలు
- షిప్పింగ్-శర్బానంద సోనోవాల్చి
- రాగ్ పాశ్వాన్-క్రీడలు
- రన్వీత్ సింగ్ బిట్టూ-మైనార్టీ శాఖ
- అన్నపూర్ణాదేవి-మహిళా శిశు సంక్షేమం
- కుమార స్వామి- భారీ ఉక్కు పరిశ్రమలు
- జ్యోతిరాదిత్య సిందియా-టెలికాం
- ప్రహ్లాద్ జోషి-ఆహారం వినియోగదారుల సేవలు
- సీఆర్ పాటిల్-జలశక్తి
- కిషన్ రెడ్డి-బొగ్గు గనుల శాఖ మంత్రి
- బండి సంజయ్-హోంశాఖ సహాయ మంత్రి
- శ్రీనివాస వర్మ- ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
- పెమ్మసాని చంద్రశేఖర్-గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి