/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/PM-Modi-1.jpg)
నరేంద్ర మోదీ నిన్న ప్రధాన మంత్రిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. దేశంలో లోక్ సభ ఎన్నికల హడావుడి ప్రారంభమైన నాటి నుంచి.. ఓ అంశంపై తీవ్రమైన చర్చ జరిగింది. అదే.. మోదీ మళ్లీ ప్రధాని అవుతారా? అని. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అనేక మంది అంచనా వేసినా.. మోదీ మళ్లీ ప్రధాని అవుతారా? లేదా? అంశంపైనే ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఇందుకు ప్రధాన కారణం బీజేపీ తీసుకువచ్చిన 75 ఏళ్ల ఫార్ములా. ఈ రూల్ ప్రకారం 75 ఏళ్లు దాటిన వారికి కేబినెట్ లోకి ఎంట్రీ ఉండదు. దీని ప్రకారమే ఆ పార్టీ అగ్రనేత అద్వానీకి సింపుల్ గా చెక్ పెట్టేశారన్న ప్రచారం ఉంది.
ఇదే ఫార్ములాతోనే మురళీ మనోహర్ జోషీ, యశ్వంత్ సిన్హాలాంటి సీనియర్లను పక్కకు పెట్టేసింది అమిత్ షా-మోదీ ద్వయం. కర్ణాటకలోనే అనేక మంది 75 ఏళ్లు దాటిన లీడర్లకు అవకాశం ఇవ్వలేదు. అయితే.. ఇదే రూల్ మోదీకి వర్తిస్తుందని.. దీని ప్రకారం మళ్లీ ఆయన ప్రధాని పీఠం ఎక్కరన్న చర్చ ఇటీవల జోరుగా సాగింది. అయితే.. ప్రస్తుతం మోదీ వయస్సు 73 ఏళ్లు. దీంతో మరో రెండేళ్లు ఆయన ప్రధానిగా కొనసాగి.. ఆ తర్వాత దిగిపోతారన్న ప్రచారం కూడా జరిగింది.
President Droupadi Murmu administers the Oath of Office and Secrecy to Jitan Ram Manjhi during the #SwearingInCeremony at @rashtrapatibhvn#OathCeremony#ShapathGrahanpic.twitter.com/pHXfc0bzXd
— PIB in Nagaland (@PIBKohima) June 9, 2024
కానీ ఆ ఫార్ములాను బీజేపీ పక్కకు పెట్టినట్లు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా జితన్‌రామ్ మాంఝీ(79)కి కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు మోదీ. దీంతో నిన్న ఆయన ప్రమాణ స్వీకారం సైతం చేశారు. మోదీ కోసమే 75 ప్లస్ ఫార్ములాను పక్కకు పెట్టారన్న చర్చ సాగుతోంది. దీంతో నరేంద్రమోదీకి ఇప్పట్లో లేదని.. ఈ ఐదేళ్లు ఆయన ప్రధానిగా కొనసాగుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీలోనూ ఈ విషయంపై అంతర్గత చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది.